వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు... ప్రభుత్వం కుప్పకూలుదంటూ సదానంద గౌడ జోస్యం

|
Google Oneindia TeluguNews

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోడీ ప్రభంజనం రాబోతుందని ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఆయా రాష్ట్ర్రాల్లో ఉన్న పార్టీల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు స్ధబ్ధుగా ఉన్న అసమ్మతి నేతలు ఒక్కసారిగా ఆయా పార్టీల నేతలపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ముఖ్యంగా ఎగ్జిట్స్ పోల్ ఫలితాలు కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్ర్రాల్లో అధికారం కోసం పావులు కదుపుతున్నారు..

కుమారస్వామీ గద్దె దిగడం ఖాయం ...

కుమారస్వామీ గద్దె దిగడం ఖాయం ...

ఈనేపథ్యంలోనే ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడిన మరునాడే మధ్యప్రదేశ్ రాష్ట్ర్రంలో బలనిరూపణకు బీజేపీ డిమాండ్ చేయగా,ఆ పార్టీ నేతల వ్యుహం తాజగా కర్ణాటకలో పడింది.దీంతో కేంద్రమంత్రి సదానంద గౌడ కర్ణాటక ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలనుందని ఆయన చెప్పారు. మహా అయితే ముఖ్యమంత్రిగా కుమార స్వామీ మరో రెండు మాత్రమే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఫలితాల వెలువడిన రెండు రోజుల అనంతరం కచ్చితంగా పదవి నుండి తప్పుకుంటారని అయన జోస్యం చెప్పారు. ఈనేపథ్యంలోనే కొత్త ప్రభుత్వానికి అంతా సిద్దమైందని పేర్కోన్నారు.

కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు...

కర్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు...


మరోవైపు కార్ణాటక కాంగ్రెస్‌లో లుకలుకలు బయటపడుతున్నపరిస్థితి కనిపిస్తోంది. ఈనేపథ్యంలోనే మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ స్వంతపార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ బహిరంగ ప్రకటన చేశారు. కర్ణాటకలోనీ సీనియర్ నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ గుండు, మాజీ సీఎం సిద్దరామయ్యతోపాటు ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పై రోషన్ బేగ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దినేష్ గుండురావుది ఒక ప్లాప్ షో అని కేసీ వేణుగోపాల్ ఒక బఫూన్‌గా అభివర్ణించడంతోపాటు మాజీ సీఎం సిద్దరామయ్య ఒక పొగరుబోతు అంటూ ఆరోపణలు చేశాడు. కాగా ఈ ముగ్గురి వల్ల ఎన్నికలు అట్టర్ ప్లాప్ షో అయ్యాయని అన్నారు. ఇలాంటీ వారి వల్లే ఫలితాలు తారుమారు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సదానంద గౌడ వ్యాఖ్యలతో అధికార మార్పిడి కలకలం

సదానంద గౌడ వ్యాఖ్యలతో అధికార మార్పిడి కలకలం

మరోవైపు 224 సీట్లున్నకర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 స్థానాలున్నాయి. కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 113స్థానాలు. ఇక ఎగ్జిట్ ఫలితాలు వెలువడినట్టే కేంద్రంలో గనక మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే... సంకీర్ణ ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలు భాజపాలోకి వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.. మరోవైపు కర్ణాటకలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు కూడ జరిగాయి. దీంతో ఉప ఎన్నికల్లోని రెండు స్థానాల్లో బీజేపీ గనుక గెలిస్తే బీజేపీ పావులు కదిపే అవకాశం ఉంటుంది.వీటితో పాటు అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, ఇటు బీజేపీ కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన రాష్ట్ర్రంలో కలకలం రేపుతున్నాయి.

English summary
Union minister D V Sadananda Gowda claimed that the Congress-JD(S) coalition government in Karnataka would collapse after the Lok Sabha poll results and HD Kumaraswamy would be the chief minister only till May 24 morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X