లే ఆఫ్స్ వేళ.. ఫ్రెషర్లకు కాగ్నిజెంట్ బంపరాఫర్..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కారణంగా అనేకమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ నియామకాలు గతేడాదితో పోల్చితే దాదాపు 20 శాతం అధికం అని తెలుస్తోంది.
ఏఐ, డిజిటల్ సాంకేతికత కారణంగా ప్రస్తుతం అనేకమంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెజాన్, ఫేస్ బుక్, మెటా లాంటి సంస్థలు భారీగా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థ ఫ్రెషర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026లో సుమారు 24 వేల నుంచి 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ పేర్కొంది.
ఇదే విషయంపై ఆ సంస్థ సీఈఓ రవి కుమార్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలు పోతాయన్న అపోహలు వీడాలని అన్నారు. ఏఐ టూల్స్ సాయంతో ఇప్పుడు కొత్తగా చేరే ఉద్యోగులు కూడా గతంలో అనుభవం ఉన్నవారు చేసే క్లిష్టమైన పనులను సులభంగా చేయగలుగుతున్నారని వివరించారు. ఈ టెక్నాలజీ వల్ల కంపెనీ ఉత్పాదకత పెరిగిందని.. అందుకే ఎక్కువ మంది యువతను తీసుకోవాలని నిర్ణయించినట్లు రవి కుమార్ పేర్కొన్నారు.

ఇక గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ సంస్థ.. తన నికర లాభంలో 18.7 శాతం వృద్ధిని సాధించింది. అలాగే ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే పెరిగింది. అలాగే గతేడాది 20 వేల మంది ఫ్రెషర్స్ ను నియమించుకోగా.. ఇప్పటికే 16 వేల మంది లైవ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారని కంపెనీ సీఎఫ్ఓ జతిన్ దలాల్ పేర్కొన్నారు. ఇక మిగతా 4 వేల మంది ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications