కార్పొరేట్ సంస్థల విరాళాల్లో ఆ పార్టీ టాప్.. ఏకంగా 82 శాతంతో..
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు అందించే విరాళాలు మూడింతలు పెరిగాయి. రూ. 3,811 కోట్లకు చేరాయి. సుప్రీంకోర్టు వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేసిన తర్వాత రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇక గతేడాది వివిధ రాజకీయ పార్టీలకు ట్రస్టుల ద్వారా అందిన విరాళాలు రూ. 1,218 కోట్లుగా ఉన్నాయి.
భారత ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 9 ఎలక్టోరల్ ట్రస్టులు మొత్తం రూ. 3,811.37 కోట్లు విరాళాలు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. వీటిలో బీజేపీ పార్టీ మాత్రమే కేవలం రూ. 3,112.50 కోట్లు విరాళాలు సాధించింది. మొత్తం విరాళాల్లో ఇవి 82 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే కాంగ్రెస్ పార్టీకి రూ. 298.77 కోట్లు విరాళంగా లభించాయి. ఇది మొత్తం విరాళంలో 8 శాతంగా ఉంది. అలాగే దేశంలోని మిగతా పార్టీలు అన్ని కలిపి రూ. 400 కోట్ల వరకు విరాళాలు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
వివాదాస్పద ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం అని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో తర్వాత రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక గతేడాది(2023-24)లో వివిధ రాజకీయ పార్టీలకు ట్రస్టుల ద్వారా అందిన విరాళాలు రూ. 1,218 కోట్లుగా ఉన్నాయి.

విరాళాల్లో విరాళాలలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 2,668.46 కోట్లు విరాళాలు ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో రూ. 2,180.71 కోట్లు కేవలం బీజేపీ పార్టీకే వెళ్లాయి. అలాగే టాటా గ్రూప్ కంపెనీల నుండి నిధులు సేకరించిన ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 914.97 కోట్లు విరాళంగా ఇచ్చింది. దీనిలో 81 శాతం బీజేపీకి వెళ్లినట్లు స్పష్టం అవుతోంది. అలాగే మహీంద్రా గ్రూప్.. న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ. 160 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఇందులో రూ. 150 కోట్లు బీజేపీకి విరాళంగా ఇచ్చింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications