చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదే ఆసుపత్రిలో చో రామస్వామి కన్నుమూత, జయ మృతి తెలియదు

జయలలిత కన్నుమూసిన అపోలో ఆసుపత్రిలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంపాదకులు చో రామస్వామి మృతి చెందారు. అయితే అదే ఆసుపత్రిలో జయలలిత మృతి చెందిన విషయం ఆయనకు తెలియదు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత జయలలిత కన్నుమూసిన అపోలో ఆసుపత్రిలోనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సంపాదకులు చో రామస్వామి మృతి చెందారు. సోమవారం రాత్రి గ.11.30కు జయలలిత అపోలోలో కన్నుమూసిన విషయం తెలిసిందే.

బుధవారం తెల్లవారుజామున గం.4.40కి చో రామస్వామి అదే ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే, జయలలిత మృతి చెందిన విషయం చో రామస్వామికి తెలియదు. ఇద్దరు ఒకే ఆసుపత్రిలో కన్నుమూసినప్పటికీ, ఇరువురి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నందున తెలియరాలేదు.

సెప్టెంబర్ 22వ తేదీన జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని వారాలకు.. అంటే నవంబర్ 29వ చో రామస్వామి అదే ఆసుపత్రిలో చేరారు. మొన్న శనివారం రోజు ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. దీంతో ఆయనను ఐసీయుకు తరలించారు.

Critical in the same hospital, Cho didn't know of Jayalalithaa's death

ఆ తర్వాత ఆదివారం నాడు జయలలితకు గుండె నొప్పి వచ్చింది. దీంతో ఆమెను సీసీయూకు తరలించారు. ఆమె సోమవారం రాత్రి కన్నుమూశారు. ఇరువురు కూడా ఒకే ఆసుపత్రిలో.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారు.

2015లో చో రామస్వామి ఆసుపత్రిలో ఉన్నప్పుడు జయలలిత సందర్శించారు. చో రామస్వామి ఆమెకు ఆప్తుడు, క్రిటిక్, గైడ్, అలాగే అడ్వయిజర్. ఇప్పుడు, అదే ఆసుపత్రిలోనే జయలలిత కన్నుమూసిన విషయం చో రామస్వామికి తెలియలేదు.

English summary
Jayalalithaa had visited a hospitalised Cho in 2015, a courtesy she extended to no other journalist. The visit spoke volumes of the relationship they shared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X