ఆధార్ అనుసంధానం: సంక్షేమ పథకాలకు గడువు మార్చి 31 వరకు పొడిగింపు

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఆధార్‌ అనుసంధానానికి గడువు మరింత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలనే విషయం తెలిసిందే.

ఈ ఏడాది డిసెంబరు 21వ తేదీతో ముగియనున్న గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచుతున్నట్లు.. అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనానికి తెలిపారు.

ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ నెంబర్లకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను.. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.

Deadline to link Aadhaar with government schemes extended till 31 March

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం గడువు పెంచుతున్నట్లు కోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

బ్యాంకు ఖాతాలకు, మొబైల్‌ నెంబర్లకు ఆధార్‌ అనుసంధానం చేసుకోని వారిపై తీసుకునే చర్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వీటిపై ప్రభుత్వం నుంచి తనకు మరికొంత సమాచారం అవసరమని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలుపగా.. వచ్చే సోమవారం ఈ విషయంపై కూడా స్పష్టత నివ్వాలని బెంచ్‌ ఆదేశించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Centre told the Supreme Court on Wednesday that it was willing to extend the deadline for linking Aadhaar to various schemes to 31 March next year. It was, however, clarified that this would apply only to those who have not yet enrolled for Aadhaar. The previous deadline of 31 December for mandatory linking to various services will continue to hold for those who already have an Aadhaar card. A bench headed by Chief Justice Dipak Misra did not pass an interim order and said that it would hear all pleas challenging making Aadhaar mandatory for various schemes on 30 October.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి