చంపేస్తాం అంటున్నారు రక్షించండి, అసభ్యంగా: జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ !
చంపేస్తామని బెదిరిస్తున్నారు రక్షించండి అంటున్న దీపాచెన్నై నగర పోలీసులను ఆశ్రయించిన జయలలిత మేనకోడలు దీపాసోషల్ మీడియా వేదికగా అసభ్యంగా దూషిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కు చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, ఆమెకు రక్షణ కల్పించాలని చెన్నై నగర పోలీసు కమిషనరక్ కు ఫిర్యాదు చేశారు. దీపా జయకుమార్ న్యాయవాది గురువారం చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల దీపా జయకుమార్ ను చంపేస్తామని వాట్సాప్ లో మేసేజ్ పంపించారని, అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. న్యాయవాది పొసుంపోన్ పాండియన్ ఇటీవల బహిరంగంగానే దీపా జయకుమార్ ను బెదిరించారని ఆరోపించారు.

సోషల్ మీడియా వేదికగా దీపా జయకుమార్ కు వేదింపులు ఎక్కువ అయ్యాయని, ఈ విషయంపై చట్టపరంగా విచారణ జరిపించాలని దీపా న్యాయవాది చెన్నై నగర పోలీసు కమిషనర్ కు మనవి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిందితులను త్వరలో పట్టుకుని న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని దీపా మద్దతుదారులు అంటున్నారు.
ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీని స్థాపించి సభ్యత్వం పేరుతో దీపా ప్రజల దగ్గర భారీ మొత్తంలో నగదు వసూలు చేసి స్వాహా చేస్తున్నారని న్యాయవాది పొసుంపోన్ పాండియన్ ఆరోపించారు. ఒక్కరికీ ఇంత వరకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా జయలలిత పేరు అడ్డం పెట్టుకుని దీపా ప్రజలను మోసం చేస్తున్నారని న్యాయవాది పొసుంపోన్ పాండియన్ బహిరంగంగా దీపా జయకుమార్ మీద ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications