దీప భర్త 'యూ టర్న్': భార్యతో గొడవల్లేవ్.. ఆమెను సీఎం చేయడమే ధ్యేయం!

Subscribe to Oneindia Telugu

చెన్నై: కొత్త పార్టీ పెట్టిన ఉత్సాహంలో ఉన్న జయలలిత మేనకోడలు దీప.. ఆర్కేనగర్ బరిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే భర్త మాధవన్ దీపతో విబేధించి పార్టీ నుంచి బయటకొచ్చేయడం ఆ పార్టీ పట్ల జనంలోకి ప్రతికూల సంకేతాలు పంపించేలా తయారైంది.

దీపకు ఊహించని షాక్.. విభేదించిన భర్త.. కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు

అయితే పార్టీకి నష్టం జరుగుతుందని భావించారో.. లేక విబేధించడం వల్ల ప్రయోజనమేమి లేదనుకున్నారో తెలియదు గానీ.. దీప భర్త మాధవన్ 'యూ టర్న్' తీసుకున్నారు. తన భార్యతో ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, తాను మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.

Deepa Jayakumar’s husband Madhavan not quits her party

తమ పార్టీని చూసి భయపడుతున్నవారే ఇటువంటి దుష్ప్రచారానికి పూనుకున్నారని మాధవన్ అభిప్రాయపడ్డారు. దీపను సీఎంగా చేసేందుకే ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీని పెట్టామని అన్నారు. కాగా, ఆర్కేనగర్ బరిలో సత్తా చాటగలిగితేనే దీప భవిష్యత్తు రాజకీయాలు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం ఉంది. లేనిపక్షంలో ప్రతికూలతలను తట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది.

ఏదేమైనా ఏప్రిల్ 12న జరగబోయే ఆర్కేనగర్ ఉపఎన్నిక జయలలితకు అసలు వారసులెవరో నిర్ణయించబోతుంది. ప్రజలు పన్నీర్ సెల్వం వర్గం వైపు మొగ్గుతారా? లేక దీపకు అవకాశమిస్తారా?, లేదూ అన్నాడీఎంకె సత్తా చాటుతుందా? అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Deepa Jayakumar husband K. Madhavan taken 'u turn' on quitting the party. He said those are just rumours
Please Wait while comments are loading...