కీలకమైన హర్డ్‌డిస్క్ స్వాధీనం, బాబా వీడియోలేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

చంఢీఘడ్: డేరాబాబా కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. డేరా బాబా అకృత్యాలను బయటపెట్టేందుకు కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రజల విశ్వాసాన్ని డేరాబాబా ఏ రకంగా తనకు అనుకూలంగా మలుచుకొని వారిని మోసం చేశారో పోలీసుల విచారణలో బయటకు వస్తోంది.

చిన్నారులతో డేరాబాబా సెక్స్: ఆ ఆస్పత్రిలో గర్భస్రావాలే అధికం

డేరాబాబాపై ఇద్దరు సాధ్వీలు తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడంతో బాబా అసలు స్వరూపం బాహ్య ప్రపంచానికి తెలిసింది.అయితే ఈ విషయమై సిబిఐ కేసు నమోదు కావడం బాబాకు 20 ఏళ్ళ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది.

  Gurmeet $exually abused schoolchildren చిన్నారులతో డేరాబాబా సెక్స్ ఆస్పత్రిలో గర్భస్రావాలే అధికం

  జైలులో డేరాబాబా దినచర్య ఇలా, పండ్లు, జ్యూస్ మాత్రమే

  అయితే డేరా సచ్ఛా సౌధలో బాబా ఏ రకమైన దారుణాలకు పాల్పడ్డాడనే విషయాలపై పోలీసులు సాక్ష్యాలను సేకరిస్తున్నారు. రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో డేరా ఆశ్రమంలో సోదాలను నిర్వహించారు.

  డేరా బాబా: సిర్సాలో గుట్టలుగా అస్థిపంజరాలు, రూ.200 కోట్ల నష్టం

  ఈ ఆశ్రమంలో సోదాలు నిర్వహించే సమయంలో సిర్సా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలను విధించారు. అయితే సోదాలు ముగిసిన తర్వాత ఇంటర్నెట్‌తో పాటు, మొబైల్ సేవలను పునరుద్దరించారు.

  డేరా సఛ్చా సౌధఆ ఐటీ విభాగం హెడ్ వినీత్ అరెస్ట్

  డేరా సఛ్చా సౌధఆ ఐటీ విభాగం హెడ్ వినీత్ అరెస్ట్

  డేరా సచ్చా సౌధాకు చెందిన ఐటీ విభాగం హెడ్ వినీత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఫరీదాబాద్ నివాసి. సిర్సాలోని మిల్క్‌ప్లాంట్, షాహ్‌పూర్‌లోని విద్యుత్ కేంద్రాలకు నిప్పుపెట్టడం, ప్రభుత్వ కార్యకలాపాలకు భంగం కలిగించడం, దేశద్రోహం తదితర ఆరోపణలతో పోలీసులు వినీత్‌ను అరెస్ట్ చేశారు. వినీత్ ఇచ్చిన సమాచారం మేరకు డేరాలోని పొలాల్లో ఉన్న ఒక టాయిలెట్ నుంచి ఒక హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

  5 వేల సిసిటీవి రికార్డుల పుటేజీ

  5 వేల సిసిటీవి రికార్డుల పుటేజీ

  ఈ హార్డ్‌డిస్క్‌లో డేరా పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 5 వేల సీసీటీవీ దృశ్యాలకు చెందిన రికార్డులున్నాయి.. వీటిలోని అత్యధిక కెమెరాలు బాబాకు చెందిన 91 ఎకారాల్లో నిర్మించిన అద్భుత మహల్, హోటల్, రిసార్ట్స్, సత్సంగ భవనం మొదలైనచోట్ల ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో బాబా జైలుకు వెళ్లకముందు ఉన్న దృశ్యాలు ఉండే అవకాశం ఉంది. బాబా జైలుకు వెళ్లిన తరువాత ఈ కెమెరాలను ఆఫ్ చేశారు. దీనికితోడు ఈ హార్డ్ డిస్క్‌ను నాశనం చేసే ప్రయత్నాలు జరిగివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

  డేరా బాబా ఆశ్రమంలో ఎముకల బ్యాంక్

  డేరా బాబా ఆశ్రమంలో ఎముకల బ్యాంక్

  డేరా బాబా తన ఆశ్రమంలో బోన్స్(ఎముకలు) బ్యాంక్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇందుకోసం రూ. 10 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాడు. దీనిని డేరాలోని షాహ్ సత్నాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు అనుబంధంగా ఏర్పాటు చేయాలనుకున్నాడు. దీనికి సంబంధించిన ప్రాథమిక పనులను ఈ ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టాడు. గత జూలైలో డేరాలో ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డేరా బాబా... బోన్ బ్యాంక్‌ను ప్రారంభిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు.డేరా బాబా తన ఎంఎస్‌జీ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 25 లక్షలు బోన్స్ బ్యాంకు కోసం విరాళంగా ప్రకటించాడు.

  డేరా ఘటనపై 15 కేసులు

  డేరా ఘటనపై 15 కేసులు

  డేరాకు సంబంధించి ఇప్పటివరకూ వివిధ పోలీసు స్టేషన్లలో మొత్తం 15 కేసులు నమోదు కాగా, 49 మందిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో కొనసాగిన సోదాల ఆధారంగా మరిన్ని అరెస్టులు, కేసులు నమోదు చేసే అవకాశాలు కూడ లేకపోలేదు. ఆశ్రమంలో ఏం జరిగిందనే దానిపై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Computers of Dera Sacha Sauda were tampered with and hard disks removed or altered before the sect’s headquarters at Sirsa were searched under the supervision of a court commissioner appointed by the Punjab and Haryana High Court. The Sirsa police seized 60 such hard disks on the information provided by Vineet Kumar, the dera’s IT head, who was arrested today.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి