• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సర్వనాశనం : ఏఆర్ రెహమాన్ ఉద్వేగం - కొత్త తరం ఎస్పీ బాలను కించపర్చిందా?

|

వయసు పెరిగినా.. గాత్రంలో ఏమాత్రం వన్నె తగ్గకున్నా.. మిలీనియం ఎంటరైన తర్వాత లెజెండరీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జోరు తగ్గడానికి కారణాలేంటి? అప్పటికి కొత్త తరమైన ఏఆర్ రెహమాన్ లాంటివాళ్లు గానగంధర్వుడితో ఒకటీ అరా తప్ప ఎక్కువ పాటలు ఎందుకు పాడించలేదు? కొత్త తరానికి బాలు చేదయ్యారా? అందుకే సినిమా పాటల కంటే టీవీల్లో సంగీత కార్యక్రమాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారా?.. లాంటి ప్రశ్నలు స్వయంగా బాలునే చాలా సార్లు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే..

అంతటి గాన గంధర్వుడికే గొంతు అరువు - ఎస్పీ బాలు లైఫ్‌లో అరుదైన ఘటన - సుఖ్విందర్ ఎంత లక్కీ!

బాలు ఏమన్నారంటే..

బాలు ఏమన్నారంటే..

కొత్త తరం మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? అని తరచూ ఎదురయ్యే ప్రశ్నకు బాలు తనదైన శైలిలో జవాబిచ్చేవారు. కళాకారుడిగా కొన్ని కోరుకోవడం సహజమే అయినా, తాను పక్కా ప్రాక్టికల్ మనిషినని, మార్పును గౌరవంగా అంగీకరిస్తానని, కొత్త తరం తనకు అవకాశాలు ఇవ్వడం లేదన్న మాట వాస్తవం కాదని, ‘‘నేను మాత్రమే పాడగలిగిన పాట కచ్చితంగా నా దగ్గరికే వస్తోంది'' అని బాలు పేర్కొనన్నారు. ఈ తరహా చర్చలో ఏఆర్ రెహమాన్ పేరు ప్రముఖంగా వినిపించేది..

సెక్స్‌లో ఈ కండోమ్స్ వద్దు - అన్నీ వాడి పారేసినవే - నీళ్లలో మరగబెట్టి తిరిగి అమ్మకం - మహిళ అరెస్ట్

రెహమాన్ వర్సెస్ బాలు

రెహమాన్ వర్సెస్ బాలు

నిజానికి ఈ పోలిక వంద శాతం అవాస్తవం. సినిమా సంగీతానికి సంబంధించిగానీ, వ్యక్తిగంగాకానీ ఎస్పీబీ, రెహమాన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ కొందరు దురభిమానులు పనిగట్టుకుని ఈ తరహా ప్రచారాన్ని సాగించేవాళ్లు. మిలీనియం తర్వాత సినిమా సంగీతంలో.. సాహిత్యం పాళ్లకంటే రణగొణ ధ్వనులు శృతిమించాయనే అపవాదు ఉండేది. రెహమాన్ శబ్దాలకు ఇచ్చినంత ప్రాధాన్యం గొంతులకు ఇవ్వడు కాబట్టే లెజెండరీ సింగర్లను కాదనుకుని కొత్త వాళ్లతో ట్రైచేస్తాడని అప్పట్లో వాదన వినిపించేది. ఎస్పీబీ మాత్రం ఈ వాదనను ఖండించేవారు. కొత్త నీరు ఎల్లప్పుడూ అవసరమేనని గుర్తుచేసేవారు. అయితే సాహిత్యాన్ని, గాయకుడిని సంగీతం డామినేట్ చేస్తుండటంపై మాత్రం ఒకటిరెండు సార్లు బాలు అసంతృప్తి వెళ్లగక్కారు. కానీ రెహమాన్ ను ఏనాడూ మాట అని ఎరుగడు. ఎందుకంటే..

సర్వనాశనం..

సర్వనాశనం..

రెహమాన్ తొలి సినిమా రోజా పాట రికార్డింగ్ సమయంలో బాలు ఓ ఇటర్వ్యూ ఇచ్చారు. దేశం గర్వించదగ్గ స్థాయికి రెహమాన్ ఎదుగుతాడని ఎస్పీబీ ఆనాడే డిక్లెర్ చేశారు. రోజాలో లీడ్ సింగర్ బాలునే అయినా, రానురాను రెహమాన్ ఆల్బమ్స్ లో బాలు పాత్ర ఒక్క పాటకే పరిమితం కాసాగింది. శివాజీ సినిమా తర్వాత రెహమాన్ కోసం బాలు పాడిందేలేదు. అంతమాత్రాన బాలు గొప్పతనం తగ్గకపోయినా, ఆయన మరణించిన సందర్భంలో గత విషయాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఎస్పీబీ పట్ల తన భక్తిని ఏనాడూ దాచుకోని రెహమాన్.. ఇప్పుడా లెజండరీ మరణవార్త విని భావోద్వేగానికి గురయ్యాడు. బాలు మరణంతో సర్వం నాశనమైపోయిందన్న ఫీలింగ్ కలుగుతోందని రెహమాన్ ట్వీట్ చేశారు.

English summary
Music directors, composers and singers paid tribute to the legendary SP Balasubrahmanyam who died in Chennai on Friday after COVID-19 complications. The singer was 74. Music director AR Rahman, who began working with the singer in the 1990s, said he was “devastated” by the loss. Balasubrahmanyam career spanned nearly six decades, having worked in the Tamil, Telugu, Kannada, Malayalam and Hindi film industries. He held a Guinness World record for singing over 40,000 songs. The singer was notably one of the few artists to work with music legends across various eras such as MS Viswanathan, Ilaiyaraaja and Rahman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X