తీవ్ర నిరాశ: బాబా రాందేవ్‌పై డిగ్గీ రాజా సంచలన వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించారు. తాజాగా యోగా గురు బాబా రాందేవ్‌ను దొంగ బాబా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

సోమవారం డిగ్గి రాజా మీడియాతో మాట్లాడుతూ.. అఖిల భారతీయ ఆకార పరిషత్ ఆదివారం 14మంది దొంగ బాబాల పేర్లను వెల్లడించింది. కానీ, బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.

Disappointed over Ramdev’s name missing from ‘fake baba’ list: Digvijaya

నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రాందేవ్ కూడా నకిలీ బాబానేనని డిగ్గీ రాజా అన్నారు.

మనుస్మృతి ప్రకారం కాషాయం ధరించి ఆధ్యాత్మకవేత్తగా ఉన్న వ్యక్తి వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలంటూ అఖిల భారతీయ ఆకార పరిషత్‌ను అడిగారు.
అదే విధంగా నకిలీ బాబాల జాబితాలో బాబా రాందేవ్ పేరును చేర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. 14మంది నకిలీ బాబా ఉన్నారంటూ ఆకార పరిషత్ ఆదివారం ఓ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior Congress leader Digvijaya Singh on Monday said he was “disappointed” over the missing name of Baba Ramdev from a list of ‘fraud’ saints released a day earlier by a religious body.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి