వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్‌లో ఎడాపెడా ఈ పనులు చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ బ్లాక్.. బీ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల ప్రైవసీని పరిరక్షించడం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. వాట్సాప్ లో భద్రతా ప్రమాణాలను మెరుగుపరుస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్ లను అందిస్తోంది. ఇక యూజర్లకు సైతం వాట్సాప్ ను వినియోగించాలి అనుకుంటే అనేక నియమ, నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి వాట్సాప్ సిద్ధమైంది.

 వాట్సాప్ ఎడాపెడా వాడేవారికి అలెర్ట్.. ఈ రూల్స్ తెలుసుకోవటం మస్ట్

వాట్సాప్ ఎడాపెడా వాడేవారికి అలెర్ట్.. ఈ రూల్స్ తెలుసుకోవటం మస్ట్

ఇప్పటికే వాట్సాప్ అకౌంటు యూజర్లు నిజానిజాల నిర్ధారణ చేసుకోకుండా స్పామ్ పోస్టులను పంచుకుంటే వారి ఖాతాలను బ్లాక్ చేయాలని వాట్సాప్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆగస్టులో వాట్సాప్ భారతదేశంలో 23 లక్షల ఖాతాలను బ్లాక్ చేసింది. ఇక వాట్సాప్ వినియోగదారులు తమ వాట్సాప్ ఖాతాలు బ్లాక్ కాకుండా ఉండాలంటే వాట్సాప్ పెట్టిన నియమనిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ను పంపించేటప్పుడు అవాస్తవాలను ప్రచారం చెయ్యొద్దని వాట్సాప్ పేర్కొంది. ఏదైనా మెసేజ్ లేదా ఇమేజ్ వస్తే, అందులో నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా వేరొకరికి ఫార్వర్డ్ చేయడం డేంజర్ అని సూచిస్తుంది.

తప్పుడు సందేశాలు పంపితే అకౌంట్ బ్లాక్

తప్పుడు సందేశాలు పంపితే అకౌంట్ బ్లాక్

వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ ఒకేసారి ఐదుగురికి మించి ఫార్వర్డ్ చేయలేరు. ఇక అదే మెసేజ్ మరో ఐదుగురికి పంపించాలంటే మరో విడత ఫార్వర్డ్ చేయాలి. అయితే ఇలా నిజానిజాలు తెలియకుండా ఎక్కడి నుండో వచ్చిన మెసేజ్ ను ఫార్వర్డ్ చేయడం మంచిది కాదని హెచ్చరిస్తుంది.

తప్పుడు సందేశాలు, చట్టవిరుద్ధమైన చర్యలు, వ్యక్తులు, సంస్థల పరువుకు భంగం కలిగించే మెసేజ్ లను వాట్సప్ వేదికగా పంపించినా వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అవుతుందని చెబుతున్నారు. ఇక ఆటోమేటెడ్ బల్క్ మెసేజ్లను పంపించకుండా చూసుకోవాలని చెబుతోంది.ఒకవేళ అలా పంపిస్తే వాట్సాప్ మిమ్మల్ని స్పామ్ స్టర్ గా గుర్తిస్తుంది

స్పామ్ నా... బ్లాక్ చెయ్యాలా .. మెసేజ్ అందిన యూజర్స్ ఓకే అంటే మీ ఖాతా బ్లాక్

స్పామ్ నా... బ్లాక్ చెయ్యాలా .. మెసేజ్ అందిన యూజర్స్ ఓకే అంటే మీ ఖాతా బ్లాక్

వాట్సప్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా ఒక కాంటాక్ట్ నుండి ఏదైనా సందేశం వస్తే అది స్పామ్ నా? బ్లాక్ చేయాలా? అని యూజర్స్ ను వాట్సాప్ అడుగుతుంది. యూజర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాట్సాప్ సదరు ఖాతాలపై చర్యలకు దిగుతుంది. బ్రాడ్ కాస్ట్ మెసేజ్ లు తరచుగా పంపిస్తే, ఆ మెసేజ్ లు అందుకున్న వారు రిపోర్టు చేస్తే, అప్పుడు కూడా అకౌంట్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

కాబట్టి వాట్సాప్ వినియోగదారులు బ్రాడ్ కాస్ట్ మెసేజ్లు పంపించడం మంచిది కాదని సూచిస్తున్నారు. మనం పంపించే మెసేజ్ ల విషయంలో అవతల యూజర్ రిపోర్ట్ చేస్తే కచ్చితంగా మన ఖాతా పై వేటు పడుతుందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించకుండా వాట్సాప్ ను వినియోగిస్తే మీ అకౌంట్ భద్రంగా ఉంటుందని, లేదంటే అకౌంట్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.

English summary
WhatsApp will block the accounts of such people if they forward the messages without knowing the facts while using WhatsApp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X