వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమంత్ సోరెన్‌ శాసన సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు గవర్నర్ ఉత్తర్వులు.. ఈసీ నోటిఫై..?

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు షాక్ తగలనుంది. గనుల కేటాయింపు అంశం పీఠముడిగా మారింది. ఇప్పటికే శాసన సభ్యత్వం రద్దు చేస్తున్నామని గవర్నర్ రమేశ్ బయస్ ఉత్తర్వులు జారీచేశారు. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేయాల్సి ఉంది. ఈసీ నోటిఫై చేసిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కానీ దానిని ఈసీ ధృవీకరించాల్సి ఉంది.

గవర్నర్ ఉత్త‌ర్వులతో తక్షణమే హేమంత్ సోరెన్ స‌భ్య‌త్వం ర‌ద్దయిపోయిందనే వాదన జరుగుతుంది. కానీ ఇంకా అధికార ప్రకటన మాత్రం రాలేదు. త‌న‌కు తానుగా గ‌నులను కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై విమ‌ర్శ‌ల వచ్చాయి.

Ec to issue notification on disqualification of Hemant Soren as MLA: Sources

హేమంత్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై కేంద్ర ప్ర‌భుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదును కేంద్రం... ఎన్నిక‌ల సంఘానికి పంపడం, హేమంత్ శాస‌న స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకు ఈసీ సిఫార‌సు చేయ‌డం, ఈసీ సిఫార‌సు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం తీసుకోవ‌డం చకచకా జ‌రిగిపోయాయి. కీల‌క ప‌రిణామం త‌ర్వాత త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

English summary
Election Commission will issue notification on the disqualification of Hemant Soren as MLA, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X