• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మూడు ఏకేలు దేశానికి ప్రమాదం: మోడీ వివరణ

|

భోపాల్: ‘మూడు ఏకేలు దేశానికి ప్రమాదకరంగా మారాయి. అందులో ఒకటి ఏకె-47(రైఫిల్) కాగా, రెండోది కేంద్రమంత్రి ఏకె అంటోనీ, మూడోది ఏకె-49 (అరవింద్ కేజ్రివాల్). ఈ మూడు ఏకేలు పాకిస్థాన్‌కు సహకరిస్తున్నాయి.' అని బుధవారం ‘భారత్ విజయ్' యాత్రను ప్రారంభించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బుధవారం చేసిన తన వ్యాఖ్యలపై మోడీ వివరణ ఇచ్చారు.

ఉగ్రవాదులకు ఇష్టమైన ఆయుధం ఏకె-47

Explained- The Three AKs That Narendra Modi Mentioned

1990 నుంచి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంపై ఉగ్రవాద దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్.. భారతదేశానికి తలనొప్పిగా మారింది. పాకిస్థాన్ నుంచి సరిహద్దు గుండా వేలాది మంది ముజాహిదీన్ తీవ్రవాదులు మనదేశంలోని జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ దేశాలకు చెందిన యువకులలో హింసా ప్రవృత్తిని నింపి అల్లకల్లోలం సృష్టించేందుకు మనదేశంలోకి పంపిస్తున్నారు. సాయుధ విద్యల్లో సరిహద్దులో ఏర్పరచుకున్న స్థావరాల్లో వారికి శిక్షణనిస్తున్నాయి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు.

ఉగ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న భారత ఆర్మీ వారి నుంచి ఇప్పటికే 80,000 ఏకె-47 ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. అవన్నీ పాకస్థాన్‌కు చెందినవే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనేకాకుండా భారతదేశంలోని మిగితా ప్రాంతాల్లోనూ పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అందులో ముఖ్యమైనవి మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన 26/11 దాడి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య ఉగ్రవాదుల దాడి, ఆత్మాహుతి దాడులు జరిగాయి.

పాకిస్థానీయులు ఎక్కువగా ఏకె-47 ఆయుధాలనే దాడులకు ఉపయోగిస్తున్నారు. భారతదేశాన్ని భయపట్టేందుకు పాకిస్థాన్ తన ఏకె-47 ఆయుధాలను ఉపయోగిస్తోంది. అప్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు విరమించుకోగానే పాకిస్థాన్ ఆధునిక ఆయుధాలైన ఏకె-47లు కలిగిన జిహాదీ ఉగ్రవాదులను భారతదేశం వైపు పంపించడం ప్రారంభించింది.

ఇలాంటి పాకిస్థాన్‌కు పార్లమెంటులో మద్దతుగా మాట్లాడిన కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకె అంటోనీ

పాకిస్థాన్ ప్రశంసలు కురిపించిన ఏకె అంటోనీని కూడా నరేంద్ర మోడీ ఏకె-47గా అభివర్ణించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు ఏకె అంటోనీ తనను తాను వివాదాల్లోకి లాక్కున్నారు. 2013 ఆగస్టులో భారత సరిహద్దు లోపలికి ప్రవేశించిన పాకిస్థాన్ ఆర్మీ ప్రత్యేక దళాలు మన సైన్యం కాల్పులకు తెగపడ్డాయి. ఈ దాడిలో ఐదుగురు భారత సైనికులు చనిపోయారు. మరొకరికి గాయాలయ్యాయి. ఇదొక్కటే కాదు ఆ సంవత్సరంలో అనేక సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ చేసిన పనిని ఆశ్చర్యకరంగా భారత రక్షణశాఖ మంత్రిగా ఉన్న ఏకె అంటోనీ, ఎవరో ఉగ్రవాదుల చేసిన దాడిగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిలో 20మంది సాయుధులుగా ఉండటంతోపాటు పాకిస్థాన్ ఆర్మీ దుస్తుల్లో ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌కు మద్దతుగా ఈ విధమైన వ్యాఖ్యలు అంటోనీ ఎందుకు చేస్తున్నారో ఇప్పటికీ తెలియడం లేదు. అయితే ఇది అతని ఒక్కడి పని కాకపోవచ్చు. అతని వెనక యూపిఏ ప్రభుత్వం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సరిహద్దులో ఉగ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగించాలన్న పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్ఐ సహకారం లేకుండా సాధ్యం కాదనేది అంటోనీ గుర్తించడం లేదు. తరచూ అంటోనీ పాకిస్థాన్‌కు మద్దతుగా ఎందుకు నిలుస్తున్నారో తెలియడం లేదు. భారత ఆర్మీ చెబుతున్నదానికి అంటోనీ చెబుతున్న దానికి పొంతన లేకుండా ఉంటోంది.

తన వ్యాఖ్యలపై బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో అంటోనీ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. పార్లమెంటులో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు అంటోని క్షమాపణలు చెప్పాలని బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ డిమాండ్ చేశారు. అంటోనీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మరో బిజెపి నేత జశ్వంత్ సింగ్ అన్నారు.

ఎకె ఎంటోనీ మూలంగా భారత భద్రతా వ్యవస్థ కూడా బలహీనంగా మారిపోయింది. హౌట్జర్, హెలికాప్టర్స్, కాంబత్ ఎయిర్ క్రాప్ట్స్, మిసైల్స్, సబ్ మెరైన్స్ లాంటి పలు ముఖ్యమైన రక్షణ ఒప్పందాలు అంటోనీ చేతకానితనం వల్ల మధ్యలోనే ఆగిపోయాయి. రక్షణశాఖకు కేటాయించాల్సిన ఖర్చులను జీతాలు, ఇంధనాల కోసం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం బలహీనంగా మారిన భారత ఆర్మీ ఏదైనా పెద్ద యుద్ధం వస్తే 20 రోజులు కూడా పోరాడలేని స్థితిలో ఉంది. ఏకె అంటోనీ అసమర్థత వల్ల భారత ఆర్మీ అవసరమైన ఆయుధాలను కూడా సమకూర్చుకోలేని స్థితిలో ఉంది.

పలు ప్రమాదాలు చోటుచేసుకున్న కారణంగా నేవీ కూడా బలంగా కనిపించడం లేదు. ఇటీవల ఐఎన్ఎస్ సింధురత్న ప్రమాదానికి గురైన కారణంగా బాధ్యత వహిస్తూ అడ్మిరల్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఆ పదవిని ఇప్పటికీ ఈ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. మనదేశం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో పాకిస్థాన్, చైనా లాంటి దేశాలు ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్నాయి. దేశ రక్షణ మంత్రి నిర్లక్ష్యం కారణంగా నేవీ కూడా బలహీనంగా మారిపోయింది.

ఏకె-49(అరవింద్ కేజ్రివాల్)

యూపిఏ అవినీతిపై పోరాటం చేస్తానని ఎన్నికల్లో పోటీ చేసి ఢిల్లీలో అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రివాల్ తర్వాత ఆ పదవిని, ప్రజలను వదిలిపెట్టారు. ప్రస్తుతం అతను వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీపైనే పోటీ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. మోడీని టార్గెట్ చేసిన కేజ్రివాల్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటించి పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనను తప్పుపట్టారు. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం కేజ్రివాల్‌కు తెలియకపోవడం గమనార్హం. కేజ్రివాల్ అరెస్ట్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరిగింది.

మోడీతో పోటీ పడాలని కేజ్రివాల్ ఎప్పుడూ తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగా నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకు కేజ్రివాల్‌పై మోడీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ బుధవారం జమ్మూకాశ్మీర్‌లో మాట్లాడుతూ.. కేజ్రివాల్‌ను ఏకె 49గా అభివర్ణించారు. అలా ఎందుకన్నారో కూడా ఆయన వివరించారు. ఏకె-49 అంటే అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా 49 రోజులు కొనసాగిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. అందుకు జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందలేదనే కారణం చూపారని చెప్పారు.

కేజ్రివాల్ పార్టీ(ఆమ్ ఆద్మీ పార్టీ)కి సంబంధించిన వెబ్‌సైట్‌లో కాశ్మీర్‌లో కొంత భాగాన్ని పాకిస్థాన్ దేశంలో చూపారని అన్నారు. ఇది గమనించిన కొందరు జాతీయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రశాంత్ జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించాలనడంపై మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు గమనిస్తే కేజ్రివాల్ పాకిస్థాన్ ఏజెంట్ అనేందుకు అస్కారం కల్పిస్తున్నాయని తెలిపారు. భారత అంతర్గత భద్రతకు సవాల్‌గా మారిన మావోయిస్టుల సమస్యను కేజ్రివాల్ పార్టీ తేలికగా తీసుకుంటున్నారని అన్నారు. మావోయిస్టులకు, జమ్మూ వేర్పాటువాదులకు మద్దతు పలుకుతున్న కేజ్రివాల్ పార్టీ అంతర్గతంగా పాకిస్థాన్‌కు మద్దతు పలుకుతున్నారని మోడీ ఆరోపించారు.

జమ్మూకాశ్మీర్‌పై రెఫరెండం నిర్వహించడానికి ఏ భారతీయుడైన ఒప్పుకుంటారా అని మోడీ ప్రశ్నించారు.

అఫ్ఘనిస్థాన్ టైమ్స్‌లో ఆమ్నా శాశ్వాని కథనం ప్రకారం.. అవినీతిపై పోరాడుతున్న భారతదేశంలోని కొంతమందికి పాకిస్థాన్ నమ్మలేని ప్రేమను కురిపిస్తోంది. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా కేజ్రివాల్ వైఖరి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపేదిలా ఉందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ పాకిస్థాన్ ఏజెంట్ అనే మోడీ మాటలు తప్పంటారా? అంటే కాదనే సమాధానమే వస్తుంది.

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి..కానీ దేశ భద్రతలో రాజీపడకూడదు. సమర్థ నాయకత్వం లేకపోతే దేశంలోని అన్ని వ్యవస్థలు బలహీన పడిపోతాయి. భారత సైనికులను పాకిస్థాన్ ఆర్మీ హత్య చేస్తే అది ఉగ్రవాదుల పని అన్న అంటోనీ వ్యాఖ్యలు, జమ్మూకాశ్మీర్'పై రెఫరెండం నిర్వహించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు దేశంలోని వ్యవస్థలను బలహీన పర్చేవిగా ఉన్నాయి. ఇవి ప్రజలు అంగీకరించరు. మోడీ ఇదే విషయాన్ని గుర్తు చేశారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/TySX-ZaDwDY?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
During his rally in Jammu on Wednesday, Narendra Modi stated that Pakistan is using three AKs to bleed India and these three AKs are praised in Pakistan. In the run up to major elections and especially this one, strong statements and name calling often becomes the norm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more