వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా మాజీ సీఎం విల్ఫ్రెడ్‌ డిసౌజా కన్నుమూత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి విల్ఫ్రెడ్‌ డిసౌజా శుక్రవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశార. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత రాత్రి శ్వాస కోశ సంబంధ వ్యాధితో బాధపడుతుండటంతో ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న తరుణంలో శుక్రవారం ఉదయం 9:15 గంటలకు గుండెనొప్పితో తుది శ్వాస విడిచినట్లు డాక్టర్‌ శేఖర్‌ సాల్కర్‌ తెలిపారు. విల్ఫ్రెడ్‌ డిసౌజా మూడు సార్లు గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు.

Former Goa CM Dr Wilfred de Souza passes away

వృత్తిరీత్యా సర్జన్‌ అయిన విల్ఫ్రెడ్‌ డిసౌజా యూకేలోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌లో డబుల్‌ ఫెలో పొందిన అతి కొద్ద మంది వ్యక్తుల్లో ఒకరు. 1974లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.

భారత మాజీ రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ చేతుల మీదగా డాక్టర్ బీసీ రాయ్ అవార్డును కూడా అందుకున్నారు. గోవా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి గెలిచి తనదైన ముద్రను వేయడమే కాకుండా, అనతికాలంలో ఉన్నత పదవులను పొందారు.

గోవా ముఖ్యమంత్రిగా తొలిసారిగా 1993లో పదవి బాధ్యతలను స్వీకరించారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 1980ల్లో గోవాలో కాంగ్రెస్ పాగా వేసేందుకు ముఖ్య భూమికను పోషించారు.

English summary
Former chief minister, Dr Wilfred de Souza passed away after a brief illness at a city hospital on Friday morning. He was 88.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X