వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భిన్నంగా గుజరాత్ పొలిటికల్ సీన్: మోదీతోపాటు పలువురు నేతల ప్రచార ఝరి!

2002 నుంచి ఇప్పటివరకు గుజరాత్‌లో ఒంటరిగా బీజేపీని అధికారంలోకి తెచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. తొలిసారి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భిన్నంగా దేశంలోని వివిధ ప్రాంతాల నేతలు ఎన్నికల ప్రచార బరిలోకి దించారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీకి 2002 నుంచి వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికలు.. 2014 లోక్‌సభ ఎన్నికలు, తర్వాత మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ పక్షాన నిలిచి ప్రచారం చేసి విజయం సాధించారు. 2002లో అనూహ్యంగా గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ.. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి జీవన్మరణ సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ప్రస్తుతం కమలనాథులు ఎన్నికల వ్యూహం మార్చేశారు.
ఇప్పటివరకు పార్టీకి జవసత్వాలు కలిగించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్థానే.. బీజేపీకి నూతన పోస్టర్ బాయ్‌గా నిలిచిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదలు కేంద్ర మంత్రి ఉమా భారతి వరకు అందరూ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. 182 సీట్లు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 150 సీట్లను సాధించిన తీరాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్దేశించిన లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు.

రాహుల్ గాంధీపై ఇలా యోగి ఆదిత్యనాథ్

రాహుల్ గాంధీపై ఇలా యోగి ఆదిత్యనాథ్

కేంద్రంలో మూడేళ్లపాటు అధికారంలో ఉండటంతోపాటు 1998 నుంచి వరుసగా గుజరాత్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఇక మరోవైపు విద్యా ఉద్యోగ రంగాల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం హార్దిక్‌ పటేల్‌ నాయకత్వాన పాటిదార్లు దూరమవడం, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం తదితర పరిణామాల నేపథ్యంలో విస్త్రుత ప్రచారం ఆ పార్టీకి అవసరమైందని భావిస్తుండటంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నుంచి దక్షిణ గుజరాత్‌తో పర్యటించడమే కాదు కాంగ్రెస్ పార్టీకి అభివ్రుద్ధి అంటే పట్టదని విమర్శలకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ఉపాద్యక్షుడు రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధ్వంసానికి మారుపేరని అభివర్ణించారు యోగి ఆదిత్యనాథ్. దేశంలో దారిద్ర్యానికి, నక్సలిజం పెరిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని పేర్కొన్నారు.

రాజస్థాన్ సీఎం వసుంధర రాజె ప్రచారం

రాజస్థాన్ సీఎం వసుంధర రాజె ప్రచారం

గురువారం నుంచి కేంద్ర మంత్రి ఉమాభారతి ఉత్తర గుజరాత్‌లో ప్రచారం చేస్తున్నారు. ఆమె వ్యక్తులను కాక ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ హత్య నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం పొందిందని ఉమా భారతి చెప్పారు. నాటి నుంచి గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపారని ప్రచారం చేస్తూ లాభ పడ్డారని చెప్పారు. గాంధీజీ దారుణ హత్య తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారీగా నష్టపోయిందని తెలిపారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజె కూడా ఆమె వెన్నంటి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. భారతదేశానికి పట్టిన మురికి ‘కాంగ్రెస్ పార్టీ' అని మండిపడ్డారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో కలిసి గుజరాత్ గౌరవ్ యాత్రలో పాల్గొన్న రాజె మాట్లాడుతూ.. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని జాతిపిత మహాత్మాగాంధీ సూచించారు. ప్రస్తుతం ఆ తరుణం వచ్చేసింది' అని చెప్పారు.

గుజరాత్‌లో సుష్మా స్వరాజ్ ప్రచారం ఇలా

గుజరాత్‌లో సుష్మా స్వరాజ్ ప్రచారం ఇలా

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ శనివారం తన ప్రచారాన్ని అహ్మదాబాద్‌ నుంచి ప్రారంభించారు. ఆమె ముందుగా అక్కడి కమ్యూనిటీ హాలులో మహిళా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీ మహిళలకు వ్యతిరేకి కాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కేంద్ర క్యాబినెట్ కమిటీల్లో మహిళలకు చోటు లభించేదే కాదన్నారు. ఆరెస్సెస్ మహిళల పట్ల వివక్ష చూపుతుందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా సుష్మ స్వరాజ్ పై విధంగా ప్రతిస్పందించారు. ఈసారి ఎన్నికల్లో మహిళలను పెద్ద ఎత్తున సమీకరించాలన్నదే మోదీ వ్యూహంగా ప్రచారమైంది. మోదీ సూచనలమేరకు సుష్మా స్వరాజ్‌ మహిళా ఓట్ల సమీకరణపై దష్టిని కేంద్రీకరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ కూడా సోమవారం ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్‌ వెళుతున్నారు.

ఆందోళనలో కమలనాథులు ఇలా

ఆందోళనలో కమలనాథులు ఇలా

గుజరాత్ రాష్ట్రంలో బీజేపీలో ఎన్నికల ప్రచార వ్యూహంపై ఆ పార్టీ నేతలు మౌనముద్ర వీడటం లేదు. కానీ ఆయన ప్రత్యర్థులు మాత్రం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను గుర్తుచేస్తున్నారు. ఇంతకుముందు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గుజరాత్‌ నుంచి బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లేవారని, ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గుజరాత్‌కు బీజేపీ నాయకులు వస్తున్నారని హార్దిక పటేల్‌ తాజాగా ట్వీట్ చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పార్టీ నేతలు ప్రచారానికి రావడంతో తప్పుడు సంకేతాలనిస్తున్నదని బీజేపీ గుజరాత్ నేతలు అంతర్గతంగా ఆందోళనకు గురవుతున్నారు.

English summary
Since 2002, the Bharatiya Janata Party’s election campaign in Gujarat has always revolved around one personality – Narendra Modi. In the campaigns for the 2002, 2007 and 2012 Assembly elections in the state, Modi was the sole rallying point.Now, as momentum builds in Gujarat for a do-or-die poll battle later this year, it is becoming apparent that though Modi remains the pivot of the BJP’s election campaign, the party is not relying only on him or even party president Amit Shah to draw in voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X