నీట్ పరీక్ష 2019: కటాఫ్ మార్కులు ఇవే...ఈ ప్రశ్నలు చాలా కష్టంగా వచ్చాయి
ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్ 2019) జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే నీట్ పరీక్షకు సంబంధించిన సమాధానాల కీ విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మెడికల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. అయితే నీట్ -2019 కటాఫ్ మార్కులు ఎన్ని ఉండొచ్చు అనేదానిపై పలువురు సబ్జెక్ట్ నిపుణులు ఏమి చెబుతున్నారో ఒకసారి చూద్దాం.
జనరల్ క్యాటగిరీ విద్యార్థులకు నీట్ కటాఫ్ మార్క్స్ 125 నుంచి 135 వరకు ఉండే అవకాశం ఉందని గ్రేడ్‌అప్ సంస్థలో అకెడమిక్ హెడ్‌గా వ్యవహరిస్తున్న నవీన్ సీ జోషి అంచనా వేశారు. అయితే కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే కటాఫ్ మార్కులు 510 నుంచి 520 ఉండే అవకాశమున్నట్లు నవీన్ సీ జోషీ తెలిపారు. ఇదిలా ఉంటే నీట్ కటాఫ్ 130 నుంచి 140 మార్కుల వరకు ఉండే ఛాన్స్ ఉందని ఎడ్యుకేషనల్ కంటెంట్ ట్రాపర్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రాట్రే తెలిపారు. ఇక మొత్తంగా నీట్ ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే కాస్త కష్టతరంగానే వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇందులో ఫిజిక్స్ పేపర్ అత్యంత కష్టంగా రాగా.... బయలజీ పేపర్‌లో ప్రశ్నలు కాస్త సులభంగా వచ్చినట్లు రాజశేఖర్ తెలిపారు.

మే 12వ తేదీన నీట్‌కు సంబంధించిన జవాబు కీ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే పరీక్షకు హాజరైన విద్యార్థులు అంతా ఎప్పటికప్పుడు నీట్ అధికారిక వెబ్‌సైట్ (ntaneet.nic.in)ను చూస్తూ ఉండాలని నీట్ నిర్వాహకులు తెలిపారు. జవాబులకు సంబంధించి విడుదల కానున్న కీ పేపర్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రతి జవాబుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని నీట్ నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా 156 నగరాల్లో నీట్ పరీక్ష నిర్వహించగా... మొత్తం 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications