బ్రిగేడ్ గ్రూప్ కు షాక్ ఇచ్చిన ఆదాయపన్ను శాఖ: ఐటీ దాడులు, రూ. వందల కోట్లు డిపాజిట్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ప్రసిద్ది చెందిన బ్రిగేడ్ గ్రూప్ కంపెనీలకు ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాక్ ఇచ్చారు. గురువారం ఏకకాలంలో బ్రిగేడ్ గ్రూప్ కంపెనీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. బెంగళూరు, మైసూరు నగరాల్లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

బెంగళూరులోని యశవంతపురలోని బ్రిగేడ్ గేట్ వే ప్రాపర్టీస్, మైసూరులోని గోకులంలోని బ్రిగేడ్ గ్రూప్ కార్యాలయాల్లో పలు పత్రాలు పరిశీలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ. 1,000, రూ. 500 నోట్లు రద్దు చేసిన తరువాత గత సంవత్సరం నవంబర్ నెలలో బ్రిగేడ్ గ్రూప్ కంపెనీ రూ. కోట్లలో బ్యాంకుల్లో డిపాజిట్ చేసిందని సమాచారం.

Incom tax raid on Brigade group in Bengaluru and Mysuru

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన వందల కోట్ల విలువైన రూ. 1,000, రూ. 500 నోట్లను బ్రిగేడ్ గ్రూప్ కంపెనీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవాలని ప్రయత్నించిందని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు 200 మందికి పైగా ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు బ్రీగేడ్ గ్రూప్ కంపెనీ వివరాలు అధికారంగా చెప్పలేదు. బ్రిగేడ్ గ్రూప్ కంపెనీ కార్యాలయంల్లో పని చేస్తున్న ఉద్యోగులను బయటకు పంపించకుండా, బయటి వ్యక్తులు కార్యాలయాల్లోకి రానివ్వకుండా సోదాలు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The income tax (IT) department conducted raids on brigade group office in Bengaluru and Mysuru today morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి