వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లెదర్ ఇండస్ట్రీకి మరణశాసనమే: బీఫ్-పశు విక్రయాల నిషేధంపై నిరసన

దేశవ్యాప్తంగా పశు సంపద విక్రయాలు, గోవధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బీఫ్, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పశు సంపద విక్రయాలు, గోవధపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో బీఫ్, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పారిశ్రామిక రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని అఖిల భారత మాంసం, లైవ్ స్టాక్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఫౌజాన్ అలావీ అభిప్రాయ పడ్డారు. కేంద్రం నిర్ణయంతో తమ రంగాలకు మరణశాసనం లిఖించిందని లెదర్ ఎక్స్ పోర్ట్స్ కౌన్సిల్ ప్రతినిధి రమేశ్ కే జునెజా ఆందోళన వ్యక్తం చేశారు.

ముస్లింలు, క్రైస్తవులతోపాటు హిందువుల్లోనూ వేల మంది నిరుపేదల జీవనోపాధిని కేంద్రం దెబ్బ తీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక నిరుపేదలకు చౌకగా ప్రోటీన్లు లభించే అవకాశం లేకుండా ప్రభుత్వం చేసిందన్న చేసిందన్న అభిప్రాయం నెలకొంది. ఇక పశువుల సంతల్లో విక్రయానికి వెళితే వధ్యశాలకు విక్రయించడం లేదని ప్రతిజ్న చేయాల్సి వస్తున్నదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రాల స్థాయిలో వాణిజ్య, వ్యాపార సంస్థలు జాతీయ నిరసనకు పిలుపునిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక తమ పంటల సాగుతోపాటు పాడినిచ్చే ఆవులు, గోవులు, జీవాలకే పశుగ్రాసం దొరకడం దుర్లభం అవుతున్న తరుణంలో వయస్సుడిగిన పశువులనూ రైతులు సాకాల్సిన తప్పనిసరి పరిస్థితులను కేంద్రం తీసుకొస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

 India's limits on selling cattle could hurt industry, diets

కేంద్రం ఏకపక్ష నిర్ణయమని విపక్షాల విమర్శలు

గమ్మత్తేమిటంటే కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి ముందు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాల హక్కులను కాలరాయడానికే కేంద్రం పూనుకున్నదని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని తలపోస్తున్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. బీఫ్‌పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పశు విక్రయాలు, తమ జీవన విధానంపై ఆధారపడి ఉన్నదని రైతులు చెప్తున్నారు.

సుప్రీంకు వెళ్లనున్న రైతులు

గోవులు సహా పశువులు, దున్నపోతులు, ఒంటెలను పశువుల సంతల్లో విక్రయించడంపై నిషేధం విధిస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీ చేసిన నిషేధాజ్నలు వివాదాస్పదం అయ్యాయి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. పశువుల విక్రయం, గోవధను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కాలని అఖిల భారత రైతు సభ (ఏఐకేఎస్) నిర్ణయించింది. దేశంలోని 29 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఒక్కొక్క రైతు ఇందులో సహ పిటిషనర్‌గా చేరనున్నారు. తద్వారా దేశవ్యాప్తంగా గోవధ, పశు విక్రయాలపై నిషేధం వల్ల విస్త్రుతస్థాయిలో చూపే ప్రభావాన్ని యావత్ జాతికి తెలియజేయనున్నారు.

పేద రైతులు, వ్యవసాయ కార్మికులపైనే ప్రభావం

పూర్తిస్థాయిలో పశు సంపదపైనే ఆధారపడి జీవిస్తున్న పేద రైతులు, వ్యవసాయ కార్మికుల జీవితాలను ప్రభుత్వ నిషేధం ప్రభావం చూపుతుందని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా తెలిపారు. రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దేశ జీడీపీలో పశు సంవర్ధక శాఖ వాటా 7.65 శాతం. వ్యవసాయ జీడీపీలో 26 శాతంగా ఉంటుంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు చిన్న, సన్నకారు రైతుల బేరసారాల సామర్థ్యం తగ్గిపోతుందని ఏఐకేఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.

కష్ట సాధ్యంగా గోవుల విక్రయాలు

అనుత్పాదక పశువులను ఇంతకుముందు మార్కెట్‌లో తేలిగ్గా విక్రయించుకునే వారు. తర్వాత మంచి పశువులను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు గ్రామాల స్థాయిలో మాత్రమే క్రయ విక్రయాలు సాగించాల్సి ఉంటుందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పశువుల వధపై నిషేధం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చెప్తున్నారు. కానీ గోవధ కోసం పశువుల విక్రయంపై నిబంధనలు సవరించాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు. ప్రస్తుతం పశువుల విక్రయ లావాదేవీలపై నిఘా ఉండటం వల్ల వ్యాపార లావాదేవీలు కష్ట సాధ్యంగా ఉంటుందని తెలిపారు.

English summary
A new ban imposed by India's government on the sale of cows and buffaloes for slaughter to protect animals considered holy by many Hindus is drawing widespread protests from state governments and animal-related industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X