ఉక్రెయిన్‌లో క్షణం కూడా ఉండొద్దు: భారత విద్యార్థులకు కీలక ఆదేశాలు: ఎంబసీ తాజా అడ్వైజరీ ఇదే
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తోన్న భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై దృష్టి సారించింది. ఉక్రెయిన్‌లోని వేర్వేరు రీజియన్లలో 20 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వేల సంఖ్యలో సాధారణ పౌరులు నివసిస్తోన్నారు. వారిని స్వదేశానికి రప్పించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దీనికోసం విమాన సర్వీసుల సంఖ్యను పెంచింది.
Recommended Video
ADVISORY TO INDIAN STUDENTS IN UKRAINE.@MEAIndia @PIB_India @IndianDiplomacy @DDNewslive @PTI_News @IndiainUkraine pic.twitter.com/7pzFndaJpl
— India in Ukraine (@IndiainUkraine) February 22, 2022
అక్కడితో ఆగలేదు. ఉక్రెయిన్‌లో చదువుకుంటోన్న భారత విద్యార్థులకు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీని జారీ చేసింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం, ఆ రెండు ప్రాంతాల్లో తక్షణమే ప్రవేశించాల్సిందిగా తన దేశ సైన్యాన్ని ఆదేశించడంతో అక్కడి ఉద్రిక్తత పతాక స్థాయికి చేరుకుంది.

ఈ పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వస్తోన్న రాయబార కార్యాలయం అధికారులు.. కొద్దిసేపటి కిందటే తాజా అడ్వైజరీని జారీ చేశారు. తక్షణమే భారత విద్యార్థులు ఉక్రెయిన్‌ను వీడాల్సిందిగా సూచించారు. స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా సలహా ఇచ్చారు. మెడికల్ యూనివర్శిటీల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించే విషయంపై విద్యార్థులు తమ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తున్నారని వివరించారు. ఆన్‌లైన్ తరగతులను నిర్వహించే విషయంపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నట్లు చెప్పారు.
భారత విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగుతలను నిర్వహించేలా తక్షణ చర్యలను తీసుకోవాల్సిందిగా తాము ఆయా మెడికల్ యూనివర్శిటీ అధికారులకు సూచించామని, దీనికి వారు అంగీకరించినట్లు చెప్పారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ విషయంలో యూనివర్శిటీల నుంచి ధృవీకరణ కోసం ఎదురు చూడొద్దని రాయబార కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత విద్యార్థులు స్వదేశానికి వెళ్లడమే మంచిదని సూచించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications