వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... దేశంలో భారీ ఉగ్ర దాడి జరిగే ఛాన్స్..? పాక్ ఐఎస్ఐ: నిఘా వర్గాలు

|
Google Oneindia TeluguNews

భారత్‌పై ఎప్పుడూ విషం కక్కే పాక్, ఉగ్రవాద సంస్థలు మరోసారి దాడికి తెగబడే అవకాశం ఉంది. దేశంలో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ ప్రణాళిక రచించిందని నిఘా వర్గాలు తెలియజేశాయి. ఐఈడీ బాంబులతో బీభత్సం చేయాలని భావిస్తున్నాయని ఐబీ అంచనా వేసింది. జన సమ్మర్థం ఎక్కువగా ఉన్న చోట బాంబు పేల్చాలని అనుకుంటున్నాయని తెలిపింది. త్వరలో దసరా, దీపావళి పండగ వస్తోన్న సంగతి తెలిసిందే. అందుకోసం జనం షాపింగ్ కోసం.. ఇతర పనుల మీద వెళతారు. ఇదీ వారి టార్గెట్ అని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.

పండగ సమయంలోనే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని వివరించాయి. దాదాపు అందరూ ఫెస్టివల్ మూడలో ఉంటారు. భద్రతను ఈజీగా వదలేయరు.. కానీ దీనిని వారు అదనుగా భావించే ఛాన్స్ ఉంది. ఇదివరకు ముంబైలో దాడి చేసింది కూడా నవంబర్‌లో అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే సమయంలో.. నెల అటు ఇటుగా ఉగ్రవాదులు చొరబడి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. ఉగ్రవాదులు పురుషులు అని.. సరంజామా సర్దుకొని, నగదుతో సహా వచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.

ISI planning big terror strike in India, alert issued: Intel sources

గతవారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ దాడిని తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెంది.. శిక్షణ పొందిన ఆరుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు పాక్‌కు చెందిన వారు ఉన్నారు. ఆర్డీఎక్స్ నింపిన ఐఈడీ బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మరోసారి దాడి చేస్తారనే సంకేతాలతో మరింత అప్రమత్తం అయ్యారు. దేశవ్యాప్తంగా అన్నీచోట్ల.. అలర్ట్ అయ్యారు.

English summary
alert was issued in India an intelligence input hinting at a plan by Pakistan's Inter-Services Intelligence to allegedly "carry out a big terror strike" in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X