కర్ణాటక సీఎం ఎంపిక బాధ్యత కిషన్ రెడ్డికి.. మరో మంత్రికి కూడా..

కర్ణాటక కొత్త సీఎం ఎంపి ప్రక్రియ జరుగుతోంది. సాయంత్రం కర్ణాటక బీజేఎల్పీ సమావేశం అవుతోంది. ఎల్పీ నేతను సభ్యులు ఎన్నుకుంటారు. కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హై కమాండ్ అప్పగించింది. కిషన్ రెడ్డి పార్టీ పరిశీలకుడిగా బెంగళూరు వచ్చారు. సాయంత్రం బీజేఎల్పీ మీటింగ్ తర్వాత.. కొత్త సీఎం పేరును ప్రకటిస్తారు.

కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బీజేఎల్పీ భేటీలో సభ్యుల అభిప్రాయం తీసుకుంటారు. సీఎం పదవీ తమకే ఇవ్వాలని బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్‌, దళిత సామాజిక వర్గాల కోరుతున్నాయి.

Karnataka CM To Be Announced Evening, central minister kishan reddy is observer

కిషన్ రెడ్డితోపాటు మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా పరిశీలకుడిగా వచ్చారు. వీరిద్దరు కలిసి రాత్రి 7.30 గంటలకు బీజేఎల్పీ మీట్ నిర్వహిస్తారు. అందులో సభ్యుల అభిప్రాయం కోరతారు. తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పటివరకు అయితే జగదీశ్ షెట్టర్, మురుగేశ్ నిరాణి, డిప్యూటీ సీఎంలు లక్ష్మణ్ సవాడీ, సీఎన్ అశ్వత్ నారాయణ్ రేసులో ఉన్నారు.

యడియూరప్ప నిన్న సీఎం పదవీకి రాజీనామా చేశారు. ఇదివరకు జరిగిన ఊహాగానాల నేపథ్యంలో.. ఆయనను హై కమాండ్ పదవీ నుంచి తప్పించింది. వాస్తవానికి బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణం యడ్డీనే.. కానీ వయస్సు, వచ్చే ఎన్నికలు దృష్య్టా ముందుగానే పదవీ నుంచి తప్పించింది. గవర్నర్ పోస్ట్ ఇస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+