సుప్రీం ఎఫెక్ట్: న్యాయ నిపుణులతో గవర్నర్ భేటీ, అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్?

Posted By:
Subscribe to Oneindia Telugu
  కర్ణాటక బల పరీక్ష...యడ్యూరప్ప నేగ్గేనా???

  బెంగుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మే 18వ తేది సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్షను నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించింది. ఈ తరుణంలో గవర్నర్ వాజుభాయ్ వాలా శుక్రవారం నాడు న్యాయనిపుణులతో సమావేశమయ్యారు. శాసనసభ అత్యవసర సమావేశానికి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

  కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. మే 19వ తేది సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో అసెంబ్లీ అత్యవసరంగా సమావేశం కావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా శుక్రవారం నాడు న్యాయనిపుణులతో చర్చించారు.

  Karnataka governor plans to issue notification for Karnataka assembly meeting

  సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రగవర్నర్ వాజ్‌భాయ్ వాలా శుక్రవారం నాడు న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించుకోవాల్సి ఉంది. ఈ తరుణంలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంది.

  ఈ తరుణంలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నోటీఫికేషన్ ను జారీ చేసే అవకాశం ఉంది. మే 19వ, తేది ఉదయం పూటే కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రొటెం స్పీకర్ ఎన్నికతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.

  ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాత బలపరీక్ష జరిగే అవకాశం ఉంది. విశ్వాస పరీక్షలో ఏం జరుగుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. బిజెపి, కాంగ్రెస్ కూటమి కూడ విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Karnataka governor Vajbhaiwala meeting with legal experts over supreme court decision. as per the supreme court directions governor planning to issue notification for karnataka assembly meeting.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X