వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్ర సీఎంతో కాంగ్రెస్ మంత్రి భేటీ, 11 మంది జంప్!

By Mallikarjun
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ జారకిహోళి, ఆయన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్దం అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్ మంత్రితో భేటీ అయ్యారని, 11 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారని సమాచారం.

కాంగ్రెస్ VSకాంగ్రెస్, వేడెక్కిన రాజకీయం, బళ్లారి శ్రీరాములు ఎంట్రీ, ఢిల్లీకి మాజీ సీఎం!కాంగ్రెస్ VSకాంగ్రెస్, వేడెక్కిన రాజకీయం, బళ్లారి శ్రీరాములు ఎంట్రీ, ఢిల్లీకి మాజీ సీఎం!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కర్ణాటకలో ఆపరేషన్ కమల బాధ్యతలు తన మీద వేసుకున్నారని తాజాగా వెలుగు చూసింది. కాంగ్రెస్ మంత్రి రమేష్ జారకిహోళి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఇటీవల రహస్యంగా కలిశారని వెలుగు చూడటంతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఉలిక్కిపడింది.

బీజేపీ సీఎంతో కాంగ్రెస్ మంత్రి

బీజేపీ సీఎంతో కాంగ్రెస్ మంత్రి

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రమేష్ జారకిహోళి రహస్యంగా భేటీ అయిన విషయం బహిరంగం అయ్యింది. ఈ విషయంపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మంత్రి రమేష్ జారకిహోళి మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో మాకు చక్కెర ఫ్యాక్టరీలు (షుగర్ ఫ్యాక్టరీలు) ఉన్నాయని, అందు వలన సీఎం, మంత్రులతో తాము అప్పుడప్పుడు భేటీ అవుతంటామని అన్నారు. అయితే బీజేపీలో చేరుతున్నామని, చేరడం లేదని మాంత్రం ఆయన స్పష్టం చెయ్యలేదు.

షరతులు పెట్టిన బ్రదర్స్

షరతులు పెట్టిన బ్రదర్స్

రమేష్ జారకిహోళి, సతీష్ జారకిహోళి బీజేపీలో చేరి కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్దం అయ్యారు. బీజేపీలో చేరడానికి జారకిహోళి బ్రదర్ నాలుగు షరతులు పెట్టారని తెలిసింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే సతీష్ జారకిహోళిని ఉప ముఖ్యమంత్రి చెయ్యాలని షరతు పెట్టారని సమాచారం. ఇప్పటికే సతీష్ జారకిహోళి మంత్రి పదవి కావాలని అడిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని మంత్రి రమేష్ జారకిహోళి మీడియాకు చెప్పారు.

ఆరు మంత్రి పదవులు

ఆరు మంత్రి పదవులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిసిన కర్ణాటక మంత్రి తమ వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, బీజేపీకి తాము మద్దతు ఇస్తే ఆరు మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని షరతు పెట్టారని తెలిసింది. హైకమాండ్ తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రమేష్ జారకిహోళికి హామీ ఇచ్చారని తెలిసింది.

 బీజేపీ ఖర్చు పెట్టాలి

బీజేపీ ఖర్చు పెట్టాలి

11 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారని, తరువాత జరిగే ఉప ఎన్నికల్లో 11 మందిని గెలిపించుకోవడానికి బీజేపీ ఎన్నికల ఖర్చు బాధ్యత తీసుకోవాలని మంత్రి రమేష్ జారకిహోళి షరతు పెట్టారని సమాచారం.

భారీ మొత్తంలో నిధులు

భారీ మొత్తంలో నిధులు

బీజేపీకి మద్దతు ఇచ్చే 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చెయ్యాలని మంత్రి రమేష్ జారకిహోళి నాలుగవ షరతు పెట్టారని సమాచారం. జారకిహోళి సోదరుల షరతులను బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తుందా ? లేదా ? కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందా అనే విషయం కొద్దిరోజుల్లో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
Karnataka Minister Ramesh Jarkiholi met Maharashtra CM Devendra Fadnavis and discuss about join BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X