ఢిల్లీలో ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్ర భగ్నం; ఆ పోస్టర్లు, గ్రాఫిటీలు వేసిన ఇద్దరు అరెస్ట్!!
రిపబ్లిక్ డే కు ముందు ఢిల్లీలో ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేసిన పోలీసులు, తాజాగా పోస్టర్లు, గ్రాఫిటీలు వేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
రిపబ్లిక్ డే వేడుకలను ప్రతి సంవత్సరం టార్గెట్ చేసినట్టే ఈ సంవత్సరం కూడా టార్గెట్ చేసిన ఉగ్ర మూక ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలలో ఎటువంటి ఉగ్రదాడులను చేయలేకపోయింది. అయినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసుకుంటూ, ఉగ్ర కుట్రకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ఢిల్లీలో పేలుళ్లకు భారీ కుట్ర చేసిన ఉగ్రవాదులు, ఖలిస్థానీ స్లీపర్ సెల్స్ ను యాక్టివ్ చేశారని నిఘా వర్గాలు పోలీసులకు హెచ్చరికలు జ్జారీ చేశాయి. ఇక తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిపబ్లిక్ డే వేడుకలకు ముందు వారు ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, గ్రాఫిటీలు వేశారని వెల్లడించారు.
పశ్చిమ ఢిల్లీలోని పలు ప్రాంతాలలో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, గ్రాఫిటీలు గోడలపై వేసి పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు ఖలిస్థానీ స్లీపర్ సెల్స్ . ఈనెల 19 న ఢిల్లీ పశ్చిమలోని వికాస్ పురి, జనక్ పురి, పశ్చిమ విహార్ తో పాటు పలు ప్రాంతాలలో గోడలపై గ్రాఫిటీలు, పోస్టర్లు వేశారు. సిక్కు ఫర్ జస్టిస్, దాని చీఫ్ గురుపత్వంత్ పన్ను ఆదేశాల మేరకు జనవరి 26 ముందు పోస్టర్లు వేసినట్టు తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వెల్లడించారు. ఇక అరెస్టు అయిన ఇద్దరు ఖలిస్థానీ స్లీపర్ సెల్స్ అని, వారిద్దరూ డ్రైవర్లుగా పనిచేసేవారని, ఒకరు విక్రమ్ జిత్ కాగా మరొకరు బలరామ్ అని వెల్లడించారు.

ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ వారిద్దరిని అరెస్ట్ చేసి, వారం రోజులపాటు వారిని రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. ఇక వారు ఉపయోగించిన బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిద్దరూ పోస్టర్లు, గ్రాఫిటీలు వేయడం వెనుక గురుపత్‌వంత్ సింగ్ పన్నూ ప్రమేయం ఉందని వెల్లడించారు. నిందితులలో ఒకరైన విక్రమ్ జిత్ సింగ్ ఢిల్లీ నుంచి 10 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లిన గ్యాంగ్ దీప్ సింగ్ తో టచ్ లో ఉన్నారని, ఇక గ్యాంగ్ దీప్ సిక్కు ఫర్ జస్టిస్ గురుపత్వంత్ సింగ్ పన్నుకు అత్యంత సన్నిహితుడని పోలీసులు వెల్లడించారు. ఇక వీరు ఇరువురు ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, గ్రాఫిటీలు వేసిన తర్వాత ఆ వీడియోను వారికి పంపించారని పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications