సీఎం రాజీనామా ఎప్పుడు చేస్తారు ?, కుర్చీ కోసం సొంత పార్టీలో పోటీ

ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆశావహులు సీఎం కుర్చీపై దృష్టి సారించినట్లు ఆ పార్టీలోని కొందరు నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక సీఎం కుర్చీ కోసం మరో వర్గం ఎదురుచూస్తోందా అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అలాంటి రాజకీయ పరిస్థితులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రమత్తం అయ్యిందని తెలిసింది. ముందుజాగ్రత్తగా సీఎం సిద్దరామయ్య తరపున బ్యాటింగ్ చేసేందుకు ఆయన అనుచరులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర మంత్రి ద్వారా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తెలియజేయాలని సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు.

Leaders of the Congress party are competing for the Karnataka CM chair
చంద్రబాబుకు విజన్ ఉంది, జగన్ కు అది ఉంది, అంతే తేడా, మంత్రి ఆనం

ప్రస్తుతం ప్రాసిక్యూషన్‌ కేసు కోర్టులో ఉంది. కోర్టులో సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలితే కేసు నమోదు అయ్యే అవకాశం ఉందన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని సీఎం కుర్చీపై కన్నేసిన వారు ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆ పదవి కోసం కసరత్తు ప్రారంభిస్తారనే లెక్కకూడా ఉంది.

ఇలా కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు అనుకూలంగా రంగంలోకి దిగేందుకు హైకమాండ్ స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యకు అండగా నిలవాలని ఆ పార్టీ నాయకులకు సూచించిందని తెలిసింది. ఈమేరకు మంత్రి సతీష్ జారకిహోళి ఇటీవల ఓ మాట కూడా అన్నారు.

సీఎం సిద్దరామయ్య సన్నిహితుల డిమాండ్ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యకు అండగా నిలవాలని ఆ పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు.

Leaders of the Congress party are competing for the Karnataka CM chair
సార్ ఆ రోజు ఏం జరిగిందంటే ?, పోలీసుల ముందు జోగి రమేష్ స్టేట్ మెంట్, వెంట ఆ లాయర్

బీజేపీ, జేడీఎస్ నేతలు నేరుగా సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేశారు. ముడా కేసులో సీఎం సిద్దరామయ్య ఆయన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శరవేగంగా రాజకీయంగా పరిణామాలు మారిపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీఎంకు అండగా నిలవాలని ఆ పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సిద్దరామయ్య అనివార్యం అయ్యింది.

సీఎం సిద్దరామయ్యకు అండగా నిలవకపోతే వెన్నుపోటు పొడిచేవాళ్ల సంఖ్య ఎక్కువ అవుతుందని, కర్ణాటక ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం మరింత వేగవంతం అవుతుందని సిద్దరామయ్య వర్గం అంటోంది. ర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం పడిపోతే తదుపరి తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని కర్ణాటకలోని కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇలాంటి సమయంలో సిద్దరామయ్య ఆయన పదవికి రాజీనామా చేస్తే సీఎం కుర్చిలో కుర్చోవడానికి కర్ణాటకలో కొందరు కాంగ్రెస్ నాయకులు సిద్దం అవుతున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+