వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ సునామీ: ప్రణబ్, మోడీ, రాజ్‌నాథ్ భేటీ కోరిన కేజ్రీవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్త ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. ఎగ్జిట్ ఫలితాలు అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ వైపే మొగ్గు చూపాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మించి ఏఏపీ గెలుచుకుంది. ఏఏపీ 67 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 3 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఏఏపీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద సందడి కనిపించలేదు. 14 కేంద్రాల్లో కౌంటింగ్ జరిగింది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సునామీ సృష్టించారు. అన్ని పార్టీలనూ మట్టికరిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపాయింట్‌మెంట్ కోరారు.

ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభా పక్ష నేతగా అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికయ్యారు. శాసనసభ్యులు మంగళవారం సాయంత్రం సమావేశమై తమ నేతగా ఆయనను ఎనుకున్నారు. కాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశారు.

Live updates: Stage set for counting of votes in Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ గెలుపొందిన నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ సంగీతకారుడు విశాల్ దుడ్లాని ఢిల్లీ బయలుదేరారు. తొలి నుండి ఆయన ఏఏపీకి మద్దతిస్తున్నారు. ఏఏపీకి ఓటేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఫలితాలపై.. కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఇది ప్రజావిజయమన్నారు. అవినీతి, వీఐపీ సంస్కృతిని తొలగించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఫలితాలపై.. కిరణ్ బేడీ మాట్లాడుతూ.. బీజేపీ ఓటమికి బాధ్యత తనదే అన్నారు. మోడీ పాలనకు ఇది రిఫరెండం కాదన్నారు. ఈ ఎన్నికలు ప్రధాని పదవి కోసం జరగలేదని, ముఖ్యమంత్రి పదవి కోసం జరిగాయన్నారు.

ఇది సామాన్యుడి విజయమని ఏఏపీ నేత యోగేంద్ర యాదవ్ చెప్పారు. ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. దేశ రాజకీయాల్లో మలుపు అని మమతా బెనర్జీ చెప్పారు.

ప్రజల తీర్పు గౌరవిస్తామని, పార్టీ పనితీరును సమీక్షించి, ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు.

కాంగ్రెస్ అంతర్థానమైందని, కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకే పడ్డాయని, దేశ ప్రజల ఆశలకు అనుగుణంగా బీజేపీ నడుచుకోవడం లేదని లోక్‌సత్తా జేపీ అన్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ, ఏఏపీల మధ్య సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ ఏఏపీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

విజయగర్వం వద్దని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వారికి సూచించారు. కేంద్రం నుండి ఢిల్లీ అభివృద్ధికి సహకారం ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు.

కిరణ్ బేడీ 2,277 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కేజ్రీవాల్‌కు నూపుర్ శర్మ అభినందనలు తెలిపారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యర్థి పైన భారీ ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మ పైన 31,583 ఓట్ల తేడాతో గెలిచారు. కేజ్రీవాల్‌కు 57,213 ఓట్లు రాగా, నూపుర్‌కు 25,630 ఓట్లు వచ్చాయి.

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 3, కేజ్రీవాల్ పార్టీ 67 స్థానాల్లో గెలుపొందేటట్లు కనిపిస్తున్నాయి.

14వ తేదీన కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్ లీలా మైదానంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.

Live updates: Stage set for counting of votes in Delhi

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గంలో ఓడిపోయారు. సదర్ బజార్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్ ఓడిపోయారు.

బదరాపూర్‌లో ఏఏపీ విజయం సాధించింది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ గెలిచారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గంలో ఓడిపోయారు.

పన్నెండున్నర వరకు ఏఏపీ 25 స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచింది. ఏఏపీ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ ఓటమి చవిచూశారు. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

Live updates: Stage set for counting of votes in Delhi

ఢిల్లీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించాలని నినాదాలు చేశారు. ప్రియాంకకో లావో... కాంగ్రెస్‌కో బచావో అని నినదించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి గెలుపు వెల్లడైంది. ఏఏపీ నేత నారాయణ దత్ శర్మ బద్సర్ పూర్ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. తన ప్రత్యర్థి పైన దాదాపు తొమ్మిదివేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోవైపు కేజ్రీవాల్ 15వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు పూర్తి మార్కులు వచ్చాయని కిరణ్ బేడీ అన్నారు. ఢిల్లీని ఉన్నతస్థాయిలో ఉంచాలని బేడీ సూచించారు.

ఇది ప్రజా విజయమని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఏఏపీ చీఫ్‌కు ఫోన్ చేశారు.

పటేల్ నగర్‌లో కృష్ణతీర్థ్ వెనుకంజలో ఉన్నారు. గ్రేటర్ కైలాష్‌లో రాష్ట్రపతి కూతురు షర్మిష్ట ఓటమి దిశలో పయనిస్తున్నారు.

పది గంటల సమయానికి... ఆమ్ ఆద్మీ పార్టీ అరవై స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ స్థానంలోను ముందంజలో లేకుండా పోయింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రెండుచోట్ల ముందంజలో ఉన్నారు.

Live updates: Stage set for counting of votes in Delhi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ రెండో స్థానానికే పరిమితం కాకుండా.. ఎవరు ఊహించని తక్కువ స్థాయిలో స్థానాలు సాధిస్తోంది. ఏఏపీ 55 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలోనే ఉంది.

ఏఏపీ గెలుపుపై ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. బలం, బలగం ఇలా అన్నింటికి ఎదురొడ్డి ప్రజలు సామాన్యుడి వైపు నిలిచారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ప్రయత్నాలను ఢిల్లీ ప్రజలు తిప్పి కొట్టారన్నారు.

చాందినీ చౌక్‌లో అల్కా లంబా ముందంజ.

జగదక్ పురిలో బీజేపీ అభ్యర్థి జగదీష్ వెనుకంజ.

Live updates: Stage set for counting of votes in Delhi

సదత్ బజార్‌లో ఏఏపీ అభ్యర్థి ముందంజ.

కృష్ణా నగర్‌లో కిరణ్ బేడీ పైన ఏఏపీ అభ్యర్థి ఎస్కే బగ్గా ముందంజలో ఉన్నారు.

ఏఏపీ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

కౌంటింగ్ ప్రారంభం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. తొమ్మిదింపావు వరకు ఏఏపీ 37, బీజేపీ 14, కాంగ్రెస్ 3, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

కృష్ణ నగర్‌లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ వెనుకంజ

పట్పర్ గంజ్‌లో ఏఏపీ అభ్యర్థి మనీష్ సిసోడియా ముందంజ.

Live updates: Stage set for counting of votes in Delhi

సదర్ బజార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వెనుకంజ. మాకెన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం. న్యూఢిల్లీలో కేజ్రీవాల్, కృష్ణానగర్‌లో కిరణ్ బేడీ ముందంజ.

ఉత్తమ్ నగర్‌లో ఏేపీ ముందంజ.

ఎనిమిదన్నర వరకు బీజేపీ ఆరు, ఏఏపీ 9, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

గ్రేటర్ కైలాష్‌లో రాష్ట్రపతి కూతురు షర్మిష్ట వెనుకంజలో ఉన్నారు. ఏఏపీ అభ్యర్థి ముందంజ.

జగదక్ పుర్‌లో బీజేపీ అభ్యర్థఇ ముందంజ. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. పత్తర్ గర్‌లో ఏఏపీ అభ్యర్థఇ ముందంజ.

పటేల్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి కృష్ణతీర్థ్ వెనుకంజ. ఉత్తమ్ నగర్, మాదీపుర్, కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో ఏఏపీ ముందంజలో ఉంది.

వినోద్ కుమార్ బిన్నీ వెనుకంజ.

మాలవీయ నగర్‌లో ఏఏపీ అభ్యర్థి సోమనాథ్ ముందంజ.

మంగోల్ పురలో ఏఏపీ అభ్యర్థి రాఖీబిర్లా ముందంజ. భావనంలోను ఏఏపీ అభ్యర్థి ముందంజ.

ఏఏపీ పార్టీ కార్యాలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేసింది.

కృష్ణ నగర్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ముందంజలో ఉన్నారు. భావనలో ఏఏపీ అభ్యర్థి ముందంజ.

లక్ష్మీనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

రోహిణి నియోజకవర్గం నుండి బీజేపీకి తొలి ఆధిక్యం. బీజేపీ అభ్యర్థి విజేందర్ ముందంజలో ఉన్నారు.

ఏఏపీ కార్యాలయానికి కేజ్రీవాల్, ఆయన బృందం వచ్చింది.

విజయం పైన బీజేపీ ఇప్పటికీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

English summary
Security was stepped up ahead of the Delhi assembly election results today. The exercise will start at 8am across 14 centres where 20,000 EVMs hold the answer to the most awaited poll result.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X