లోక్‌సభ ఎన్నికలు 2019 : మీ ఓటు చూసుకోవడం ఎలా?
ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే పోలింగ్ కేంద్రానికి వెళ్లాక ఓటు లేదంటే ఎవరికైనా నిరాశే. అందుకని ముందస్తుగా ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవడం ఉత్తమం. అసలు ఓటు హక్కు ఉందా? ఓటర్ల జాబితాలో పేరు ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు కింది పద్దతులు ఫాలో ఐతే సరిపోతుంది.

ఓటు చూసుకోండిలా..!
ముందుగా మీ ఫోన్ లో గానీ, కంప్యూటర్ లో గానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అందులో https://electoralsearch.in (National Voters Service Portal) అనే వెబ్ సైట్ పేరు టైప్ చేయండి. ఆ సైట్ ఓపెన్ కాగానే మీకు రెండు ఆప్షన్లు కనబడతాయి. 1. Search by Details, 2. Search by EPIC No అని ఉంటాయి. Search by Details పై క్లిక్ చేయగానే మీ పేరు, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ సెగ్మెంట్ తదితర వివరాలు అడుగుతుంది. అవి ఎంటర్ చేశాక చివరన కుడివైపు ఒక టెక్ట్స్ (క్యాప్చా) కనబడుతుంది. అది ఉన్నది ఉన్నట్లుగా టైప్ చేసి కిందన ఉన్న సెర్చ్ బటన్ కొడితే చాలు. మీ ఓటుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ ఏమి రాకపోతే ఓటు లేనట్లే.

రెండో పద్దతి
Search by EPIC No రెండో పద్దతి. ఇది చాలా ఈజీ. కానీ మీకు మీ ఓటర్ ఐడీ ఎపిక్ నెంబర్ (EPIC - ELECTION PHOTO IDENTITY CARD) గుర్తుండాలి. ఒకవేళ ఎపిక్ నెంబర్ గుర్తుంటే Search by EPIC No ఆప్షన్ పై క్లిక్ చేయగానే వేరే విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి, ఏ స్టేట్ కు చెందినవారో ఆ స్టేట్ పేరు సెలెక్ట్ చేసుకుని అక్కడున్న క్యాప్చా ఎంటర్ చేస్తే చాలు. మీ ఓటుకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

ప్రతి జనవరిలో అప్‌డేట్
ఓటర్ ఐడీ ఉన్నంత మాత్రాన మీ పేరు ఓటరు జాబితాలో ఉంటుందనే విషయం కచ్చితంగా చెప్పలేము. ఎన్నికల సంఘం తరచూ ఓటర్ల జాబితాను అప్‌డేట్ చేస్తుంటుంది. ప్రతి ఏడాది జనవరి ఫస్ట్ వీక్ లో National Voters Service Portal లో కొత్త జాబితా పెడుతుంటుంది. ఒక్కోసారి పొరబాటున ఓటర్ లిస్టులో నుంచి పేర్లు తొలగిపోయే ఛాన్సుంది. అందుకే మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ఈ లింక్ https://electoralsearch.in ద్వారా చెక్ చేసుకోండి.

ఎపిక్ నెంబర్ ప్రత్యేకం
సాధారణంగా కొన్ని సందర్భాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ ఇతరత్రా తప్పులు ఉంటే మొదటి పద్దతిలో మీ వివరాలు చూపించకపోవచ్చు. అందుకే రెండో పద్దతి ద్వారా జస్ట్ ఓటర్ ఐడీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఓటు వివరాలు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఎపిక్ నెంబర్ తో నూటికి నూరు శాతం సరైన వివరాలు పొందే అవకాశముంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications