పెళ్లి చేసుకుంటానంటూ గర్భవతిని చేశాడు.. పెళ్లి మాట ఎత్తేసరికి డీఎన్ఏ టెస్ట్ అన్నాడు..

Posted By:
Subscribe to Oneindia Telugu

థానే: పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి ప్రస్తావన తెస్తే.. డీఎన్‌ఏ టెస్ట్‌ చేయించుకోమంటూ అడ్డం తిరిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

ఘోరం: కూతురికి లైంగిక వేధింపులు.. కేసు పెడితే.. తండ్రినే తగలబెట్టేశారు!

మహారాష్ట్రలో భివాండీలోని సమ్రుబాగ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(27) హోటల్ లో వంటవాడిగా పనిచేస్తుంటాడు. అదే ప్రాంతంలో బాధిత యువతి(21) పనిమనిషిగా పని చేస్తోంది.

Man arrested for raping help on pretext of marriage in Thane

ఈ క్రమంలో ఆ యువతితో పరిచయం పెంచుకున్న అతడు.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమెను తన ఇంటికి పిలిపించుకుని అనేక సార్లు అత్యాచారం చేశాడు.

ఈ క్రమంలో బాధితురాలు గర్భవతి అయింది. ఆ విషయాన్ని అతడికి చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరగా సదరు వ్యక్తి అడ్డం తిరిగాడు. ఆ గర్భానికి తాను కారణం కాదని, కావాలంటే డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోమని చెప్పాడు.

మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి యువకుడు.. భయంతో రైలు నుంచి దూకేసిన బాలిక

దీంతో తాను అతడి మాయమాటలు నమ్మి మోసపోయానని గ్రహించిన బాధితురాలు భోయివాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The police today arrested a 27-year-old man from the Bhiwandi township here for allegedly raping a woman following which she became pregnant. As per the complaint filed by the 21-year-old victim, she used to work as a domestic help in Samru Bagh area of Bhiwandi where the accused lived, a police official said. Over a period of time, the woman became friendly with the accused, who worked as a cook at a hotel in Bhiwandi. The accused used to call the woman to his home where he allegedly raped her repeatedly while promising to marry her, he said. When the woman recently became pregnant, the accused went back on his promise of marrying her and insisted that she should undergo a DNA test, the official said. On Sunday, the woman approached the Bhoiwada police, who registered an offence against the man under IPC section 376 (rape) and arrested him today, the official added.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి