బిజెపి వ్యూహంతో ఇరుకున పడ్డ కాంగ్రెస్: రామ్‌నాథ్‌కు మాయావతి నో

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎన్డీయే అభ్యర్థిగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దళిత నేత రామ్ నాథ్ కోవింద్‌ను ప్రకటించినప్పటికి బిఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. విపక్షాలు అభ్యర్థిని ప్రకటిస్తే వారికే మద్దతివ్వవచ్చునని అంటున్నారు.

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్‌నాథ్: ఎవరీ కోవింద్?

మాయావతి దళిత నాయకురాలిగా పేరుపొందారు. కేవలం మాయావతి కోసమే కాకుండా, దేశవ్యాప్తంగా పలు పార్టీల మద్దతు పొందేందుకు బిజెపి వ్యూహాత్మకంగా దళిత కోవింద్‌ను తెరపైకి తీసుకు వచ్చింది. దీంతో విపక్షాలు ఇరుకున పడ్డాయి.

రాష్ట్రపతి అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం తెలిపారు. ఎన్డీయే ఎంపిక చేసిన రాష్ట్రపతి అభ్యర్థిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు.

Maya too opposes Kovind, she is ready to support oppositioncandidate if they choose Dalit

ఎన్డీయే ఈ నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన విపక్ష పార్టీలతో మాట్లాడి ఉంటే బాగుండేదని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 22న సాయంత్రం 4.30 గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం జరగనున్నట్టు చెప్పారు.

ఈ సమావేశం విషయమై ఇప్పటికే విపక్ష పార్టీలకు సమాచారం అందించామని, ఇప్పటివరకు విపక్షాలన్నీ ఏక తాటిపై ఉన్నాయని, 22వ తేదీన ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ చెప్పారు. దళిత నేతను వ్యూహాత్మకంగా తెరపైకి తేవడంతో ఓ విధంగా కాంగ్రెస్ సహా విపక్షాలు ఇరుకున పడతాయని బిజెపి భావించింది. కాంగ్రెస్ ఆచితూచి మాట్లాడుతోంది. లేదంటే మరో దళిత నేతనే తెరపైకి తేవాలి.

కేసీఆర్, జగన్‌లకు మోడీ ఫోన్: మమత గురించి చంద్రబాబు వద్ద ఆరా

యూపీకి చెందిన దళిత నేత కాబట్టి మాయావతి మద్దతు ఇస్తుందని చాలామంది భావించారు. ఓ విధంగా మాయావతి ఇరుకున పడతుందనుకున్నారు. కానీ మాయా మాత్రం రామ్‌నాథ్ కోవింద్.. ఆరెస్సెస్, బిజెపి నేపథ్యం చూపిస్తూ మద్దతు ఇచ్చేది లేదని చెప్పే అవకాశాలున్నాయని అంటున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mayawati too opposes Kovind, she is ready to support oppositioncandidate if they choose Dalit
Please Wait while comments are loading...