వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎన్నికలు: తెర వెనక హీరో ఈయనే

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: తన మెంటర్ అమిత్ షా మాదిరిగానే భూపేంద్ర యాదవ్ కూడా తెర వెనక ఉండడానికే ఇష్టపడుతారు. అమిత్ షా మాదిరిగా వార్ రూంలో కూర్చుని పనిచేయడమే ఆయనకు నచ్చుతుంది.

ర్యాలీలకు, బహిరంగ సభలకు దూరంగా ఉంటారు. ఆయన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి. గుజరాత్ ఎన్నికల్లో బిజెపి కోసం తెరవెనక పనిచేసిన నేతల్లో ఆయన కీలకమైనవారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం తర్వాత అమిత్ షా తన సొంత రాష్ట్రం గుజరాత్‌పై దృష్టి సారించారు.

యుపి ఫలితాల తర్వాత భూపేంద్ర యాదవ్ ఇలా..

యుపి ఫలితాల తర్వాత భూపేంద్ర యాదవ్ ఇలా..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత అమిత్ షా ఓబిసి నాయకుడు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన భూపేంద్ర యాదవ్‌ను గుజరాత్ ఎన్నికల ఇంచార్జీగా ఎనిమిది నెలల క్రితం నియమించారు. ఎనిమిది నెలల కాలంలోనే భూపేంద్ర యాదవ్ సంక్లిష్టమైన, వేగంగా మారుతున్న గుజరాత్ కుల సమీకరమాలను అవగాహన చేసుకుని తగిన వ్యూహాలను రూపొందించాల్సి వచ్చింది.

ఆషామాషిగా నిర్ణయం కాదు...

ఆషామాషిగా నిర్ణయం కాదు...

భూపేంద్ర యాదవ్‌కు గుజరాత్ బాధ్యతలు అప్పగించడంలో అమిత్ షా ఆషామాషిగా వ్యవహరించలేదు. 2103లో రాజస్థాన్, 2014లో జార్ఖండ్, 2105లో బీహార్ ఎన్నికల ఇంచార్జీగా భూపేంద్ర యాదవ్ వ్వహరించారు. బీహార్‌లో ఫలితం చూపించలేకపోయినప్పటికీ రాజస్థాన్, జార్ఖండ్‌లో మాత్రం తన సత్తాను ప్రదర్శించారు. రాజస్థాన్‌‌ శాసనసభలో 200 సీట్లు ఉండగా, బిజెపి 163 సీట్లు గెలుచుకుంది. జార్ఖండ్‌ శాసనసభలో 82 సీట్లు ఉండగా బిజెపి నేతృత్వంలోని మిత్రకూటమి 47 స్థానాలు దక్కించుకుంది.

 అమిత్ షా ప్లాన్, యాదవ్ ఆచరణ

అమిత్ షా ప్లాన్, యాదవ్ ఆచరణ

భూపేంద్ర యాదవ్ గుజరాత్ ఎన్నికల్లో చేయదంటూ లేదని బిజెపి నాయకులు అంటున్నారు. టికెట్ల పంపిణీ నుంచి బూత్ స్థాయి మేనేజ్‌మెంట్ వరకు ఆయన పర్యవేక్షించారు. అమిత్ షా ప్లాన్ వేస్తే దాన్ని ఆచరణలో పెట్టింది భూపేంద్ర యాదవ్. ర్యాలీలో కనిపించడానికి ఆయన పెద్దగా ఇష్టపడరు.

ర్యాలీలు మాత్రమే గెలిపించవు...

ర్యాలీలు మాత్రమే గెలిపించవు...

కేవలం ర్యాలీలు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించిపెట్టవని భూపేంద్ర యాదవ్ గట్టిగా నమ్ముతారు. స్థానిక అంశాలపై దృష్టి పెట్టడం ఆయన వ్యూహం. ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సిఎం వంటి వారితో కూర్చోవడానికి ఆయన సమయం ఎక్కువగా పెట్టరు. స్థానిక కార్యకర్తలను కలుసుకుంటూ స్థానికంగా పనిచేసే వ్యూహాన్ని రూపొందించడంలో మునిగిపోతారు.

 పిరమిడ్ వంటి నిర్మాణం...

పిరమిడ్ వంటి నిర్మాణం...

పేజ్ ప్రముఖ్‌లను నియమించడంలో భూపేంద్ర యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఇది పిరమిడ్ వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. గుజరాత్‌లోని 182 నియోజకవర్గాల్లో 50 వేల వరకు పోలింగ్ కేంద్రాలున్నాయి. దానికితోడు శక్తి కేంద్రాలను బిజెపి ఏర్పాటు చేసింది. ప్రతి శక్తి కేంద్రం ఐదారు పోలింగ్ కేంద్రాల బాధ్యత తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో 50 పోలింగ్ కేంద్రాలుంటాయి. పేజ్ ప్రముఖ్ బూత్ ఇంచార్జీకి బాధ్యుడిగా వ్యవహరిస్తాడు అతను శక్తి కేంద్రానికి బాధ్యత వహించాలి. శక్తి కేంద్రం ఎమ్మెల్యేకు లేదా విధాన సభ ఇంచార్డీకి బాధ్యత వహించాలి. ఆయన బిజెపి రాష్ట్ర నాయకత్వానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

భూపేంద్ర యాదవ్ ఇలా తనిఖీ...

భూపేంద్ర యాదవ్ ఇలా తనిఖీ...

భూపేంద్ర యాదవ్ క్రమం తప్పకుండా పిరిమిడ్‌లోని ప్రతి దశను పరిశీలిస్తూ వచ్చాడు. పేజ్ ప్రముఖ్‌లు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని అమిత్ షాతో పాటు భూపేంద్ర యాదవ్ నమ్ముతారు. గుజరాత్‌లోని ప్రతి ఓటరు వద్దకు చేరుకోవడానికి ఇదే మార్గంగా పనిచేసింది. ప్రతి ఒక్కరితో బిజెపి సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. ఈ క్షేత్ర స్థాయి ఆచరణ కాంగ్రెసు వల్ల కావడం లేదు.

English summary
Bhupendra Yadav, much like his mentor Amit Shah, is a fiercely private man. Like Shah, he prefers from operating from the confines of a war room than from the stage at an election rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X