వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉజ్వల్ భారత్: మారిన విద్యుత్ టారీఫ్‌లతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

దేశంలోని ప్రజలందరికీ 24గంటలపాటు విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలందరికీ 24గంటలపాటు విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఎక్కువగా పునరుత్పాదక శక్తి ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.

విద్యుత్ ఛార్జీలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చి, కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో అందరికీ విద్యుత్‌ను అమలు చేస్తోంది. ఛండీఘర్‌లో ఇటీవల విద్యుత్ ఛార్జీలను ఫ్యూయల్ అండ్ పవర్ పర్చెస్ కాస్ట్ అడ్జెస్ట్‌మెంట్(ఎఫ్‌పీపీసీఏ) 18శాతం తగ్గించడంతో గృహావసరాలతోపాటు వాణిజ్య వాడకం కూడా పెరిగింది.

డోమెస్టిక్ కేటగిరీలో రెగ్యూలర్ టారీఫ్ తగ్గింపు

డోమెస్టిక్ కేటగిరీలో రెగ్యూలర్ టారీఫ్ తగ్గింపు

0-150 యూనిట్లకు గానూ డోమెస్టిక్ కేటగిరిలో రెగ్యూలర్ టాఫ్‌ను 80పైసల నుంచి 65పైసలకు తగ్గించడం జరిగింది. అలాగే 151-400 యూనిట్లకు గానూ రూ.1.68 నుంచి నుంచి రూ. 1.38కు తగ్గించడం జరిగింది. ఇక కమర్షియల్ కేటగిరి విషయానికొస్తే.. 0-150యూనిట్లకు గానూ రూ.1.51 నుంచి రూ.1.24కు తగ్గించడం జరిగింది. అదేవిధంగా 151-400యూనిట్లకు గానూ రూ. 1.68 నుంచి రూ. 1.38కు ఎఫ్‌పీపీసీఏ తగ్గించింది.

అదే విధంగా 2016-17, 2017-18 సంవత్సరాలకు గానూ అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ ల పెరుగుదల ఏమీ ఉండకపోవడం గమనార్హం.

వాస్తవిక వృద్ధి

వాస్తవిక వృద్ధి

దేశంలోని ప్రజలందరికీ విద్యుత్ సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో గత మూడేళ్లుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో విద్యుత్ సౌకర్యం కల్పనలో గణనీయమైన మెరుగుదలను సాధించింది. కాగా, గత ప్రభుత్వంలో జరిగిన బొగ్గు కుంభకోణాల కారణంగా విద్యుత్ ఉత్పాదన భారీగా పడిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం కట్టుదిట్టంగా బొగ్గు గనుల వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయాన్ని సమకూర్చింది. మే 2014లో విద్యుత్ ఉత్పాదనకు భారీగా బొగ్గు కొరత ఏర్పడింది. అయితే ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది.

శక్తి

శక్తి

ఈ నెలలోనే ప్రభుత్వం శక్తి(స్కీం ఫర్ హర్నేసింగ్ అండ్ అలోకేటింగ్ కోయల ట్రాన్స్‌స్పరెంట్లీ ఇన్ ఇండియా) అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. బొగ్గు గనుల వేలం, కేటాయింపు, చౌకగా విద్యుత్ ఉత్పత్తి ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 201-17 సంవత్సరానికి గానూ సూపిరియర్ కోల్ ద్వారా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 0.63కిలోలతో 1కిలోవాట్స్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. 2013-14లో ఇది 0.69గా ఉంది. 8శాతం తక్కువ బొగ్గుతోనే ఈ మూడేళ్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటం గమనార్హం.

ఈ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో విద్యుత్ సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు మిగులు విద్యుత్‌ను సాధించింది. మూడేళ్లలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గరిష్టంగా 60గిగావాట్ల విద్యుత్ అదనంగా చేరింది. ఉత్తర, ఈశాన్య భారతదేశంలోని సుమారు 10కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. 2011-2012తో పోల్చుకుంటే.. ఇప్పుడు రాష్ట్రాలకు అత్యంత తక్కువ ఖర్చుతో విద్యుత్ ను అందించడం జరుగుతోంది. విద్యుత్ ప్రవాహ్ డాష్ బోర్డులో దీనిని గమనించవచ్చు.

పర్యావరణాన్ని కాపాడుతూనే..

పర్యావరణాన్ని కాపాడుతూనే..

పునరుత్పాదక శక్తుల ద్వారా 2016-17లో అత్యధికంగా 11గిగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం జరిగింది. సోలార్ పవర్ ద్వారానే భారీ మొత్తంలో విద్యుత్ ను ఉత్పత్తి చేయడం గమనార్హం. పవన్ విద్యుత్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర కూడా తక్కువే. సోలార్(యూనిట్ కు రూ. 2.44), విండ్ సెక్టార్(యూనిట్‌కు రూ.3.46).
పీపీఏఎస్(ఫ్యూచర్ పవర్ పర్చెస్ అగ్రీమెంట్స్) ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను సాధిస్తోంది.

రికార్డులు

రికార్డులు

వినియోగదారులకు అందుబాటు ధరల్లో విద్యుత్‌ను అందించి ఈ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. దాదాపు 40శాతం విద్యుత్ సామర్థ్యం పెరిగింది. మార్చి 2014లో 5.3లక్షల ఎంవీఏ ఉండగా, 2017 మార్చిలో ఇది 7.4లక్షల ఎంవీఏకు పెరిగింది.
మార్చి 2014 నుంచి సౌత్ ఇండియాలో దాదాపు 116శాతం విద్యుత్ సామర్థ్యం పెరిగింది. ‘వన్ నేషన్, వన్ గ్రిడ్, వన్ ప్రైస్' లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం తక్కువ కాలంలోనే లక్ష్యాలను సాధిస్తోంది. అంతేగాక ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఎల్ఈడీ లైట్ల పంపిణీని భారీ ఎత్తున చేపట్టింది. దీంతో వినియోగదారుల విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిపోయాయి. ఉజ్వల కింద 23కోట్ల ఎల్ఈడీ బల్బులను అందజేయడం జరిగింది. ఫలితంగా వినియోదారులకు ఏడాదికి రూ.12వేల కోట్ల ఆదా అవుతోంది.

రైతులకు సహకారం

రైతులకు సహకారం

దేశంలోని రైతులకు మద్దతు అందించేందుకు నేషనల్ ఎనర్జీ ఎఫిసీయంట్ అగ్రికల్చర్ పంప్స్ ప్రొగ్రామ్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. పాత పంపులకు బదులు 5స్టార్ ఎనర్జీ అగ్రికల్చర్ పంప్స్‌ను అందజేయడం జరిగింది. ఉజ్వల్ డిస్కమ్ అస్సురెన్స్ యోజన(ఉదయ్) ద్వారా విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. డిస్కమ్ సమస్యలకు ఈ పథకం పూర్తిస్థాయి పరిష్కారాన్ని చూపింది. వినియోగదారులకు తక్కువ ఛార్జీలకే విద్యుత్ అందించడం ద్వారా రూ.12వేల కోట్లను డిస్కమ్ లు ఆదా చేచేసుకోవడానికి సహకరించింది. 2004-2014 యూపీఏ ప్రభుత్వ కాలంలో విద్యుత్ ధరలు 5.94శాతంగా ఉండగా, గత రెండేళ్లలో ఇది 3.27శాతంగా ఉంది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశమే.

బలోపేతమవుతున్న విద్యుత్ రంగం

బలోపేతమవుతున్న విద్యుత్ రంగం

కేంద్ర ప్రభుత్వ చర్యలు విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నాయి. వినియోగదారులకు అందుబాటులో ఛార్జీలు ఉండటంతో సామాన్యులు, పేదలకు కూడా విద్యుత్ సౌకర్యం లభిస్తోంది. దేశంలోని మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు కూడా విద్యుత్ అందించాలనే లక్ష్యంతో సాగుతున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని ఉజ్వల్ భారత్ కల నెరవేరుస్తోంది.

English summary
A flagship Mission of the Government is to realise the Hon’ble Prime Minister Shri Narendra Modi’s vision of 24x7 Affordable “Power for all” in an environment-friendly manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X