Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐప్యాక్ కూసాలు కదిలాయ్.. !!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC) డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు వినేష్ చందెల్‌ అరెస్ట్ అయ్యారు. బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఆయనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఢిల్లీలో ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. తదుపరి విచారణ నిమిత్తం కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు ఆయనను నేడు ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

ఈ కేసు అక్రమ మైనింగ్‌, హవాలా లావాదేవీలకు సంబంధించి 2020 నవంబర్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కు అనుబంధం. అసన్‌సోల్ సమీపంలోని కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన గనుల నుండి కోట్ల విలువైన బొగ్గును అక్రమంగా తరలించినట్లు అప్పట్లో సీబీఐ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు సాగించడానికి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది.

Money laundering case widens as ED raids I-PAC figures in politics ahead of crucial West Bengal polls

ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న హవాలా ఆపరేటర్ ఐప్యాక్ రిజిస్టర్డ్ సంస్థకు కోట్ల రూపాయల లావాదేవీలను మళ్లించినట్లు ఈడీ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ పలుచోట్ల సోదాలు చేసింది. ఏప్రిల్ 2న చందెల్ కు చెందిన ఢిల్లీ నివాసంతో పాటు, ఐప్యాక్ సహవ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ బెంగళూరు కార్యాలయం, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ ముంబై నివాసంపై తనిఖీలు జరిగాయి.

అంతకుముందు జనవరి 8న, ఐప్యాక్ కార్యాలయం, దాని వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ కోల్‌కతా నివాసాలలోనూ ఈడీ సోదాలు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో అక్కడికి చేరుకుని కొన్ని పత్రాలను తీసుకువెళ్లడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ సోదాలను అడ్డుకుని, సంబంధిత పత్రాలు, డివైజ్‌లను తొలగించారని ఈడీ ఆరోపించింది.

తృణమూల్ కాంగ్రెస్ ఆ ఆరోపణలను ఖండించింది. ఎన్నికలకు ముందు తమ పార్టీ ప్రచార వ్యూహాలకు సంబంధించిన కీలక సామగ్రిని ఈడీ లక్ష్యంగా చేసుకుందని ఆ పార్టీ ఎదురుదాడికి దిగింది. సోదాలకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23, 29 తేదీల్లో జరుగనున్నాయి. ఐప్యాక్ 2021 నుండి తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ సలహా సేవలను అందిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+