విమానంలో ఎయిర్ హోస్టెస్ కు లైంగిక వేధింపులు: బెంగళూరులో ఎంటెక్ విద్యార్థి చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఎంటెక్ విద్యార్థిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. ఒక ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించి, మరో ఎయిర్ హోస్టెస్ చెంప చెల్లుమనిపించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బుధవారం కోల్ కతా నుంచి బెంగళూరుకు ఇండిగో విమానం బయలుదేరింది. ఆ విమానంలో కోల్ కతా నివాసి క్షితిజ్ గురుంగ్ బెంగళూరు బయలుదేరాడు. ఇతను బెంగళూరులోని ప్రైవేట్ కాలేజ్ లో ఎంటెక్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. విమానంలో ప్రయాణించే సమయంలో క్షితిజ్ గురుంగ్ రెచ్చిపోయాడని సమాచారం.

MTech student arrested in sexual harassment in indigo flight in Bengaluru

విమానంలో ప్రయాణించే సమయంలో ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె శరీరం మీద ఎక్కడపడితే అక్కడ చేతులు వేశాడు. ఆ సమయంలో ఆమెకు మద్దతుగా మాట్లాడిన మరో మహిళా ఎయిర్ హోస్టెస్ చెంప చెల్లుమనిపించాడు. సాటి ప్రయాణికులు ముగ్గురికి నచ్చ చెప్పారు.

సాటి ప్రయాణికులు విమానంలో గొడవ పెద్దదికాకుండా చూశారు. ఇండిగో విమానం బెంగళూరు చేరుకున్న తరువాత ఇద్దరు ఎయిర్ హోస్టెస్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎయిర్ హోస్టెస్ తో అసభ్యంగా ప్రవర్తించిన క్షితిజ్ గురుంగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MTech student arrested in sexual harassment in indigo flight in Bengaluru International Airport.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి