వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలాం యాదిలో: మిసైల్ మ్యాన్ మనల్ని విడిచి నేటికి ఆరేళ్లు..

|
Google Oneindia TeluguNews

మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చనిపోయి ఇవాళ్టితో ఆరు ఏళ్ళు పూర్తయ్యాయి. యువతకు స్ఫూర్తిని నింపి.. కలలంటే నీకు నిద్రలో వచ్చేవి కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి అని ఉత్తేజితులను చేశారు. కలాంకు యావత్ దేశం ఘన నివాళులు ఆర్పిస్తుంది. శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి. దేశ యువతకు ఆదర్శప్రాయులు..మహనీయుడు అబ్దుల్ కాలం చేసిన సేవలను యావత్ దేశం స్మరించుకుంటుంది.

కలలు సాకారం..

కలలు సాకారం..

కలలను సాకారం చేసుకోవాలని విద్యార్ధి లోకాన్ని తట్టిలేపిన మహనీయులు అబ్దుల్ కలాం. ఆచరణ ద్వారా కలలను సాకారం చేసుకుని చూపించిన ఆదర్శమూర్తి. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అందించిన సేవలు సామాన్యమైనవి కావు. చిన్న లక్ష్యం కలిగి ఉండటమనేదే పెద్ద నేరంతో సమానమని అబ్దుల్ కలాం ఎపుడూ చెబుతుండేవారు. పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటికోసం పోరాడాలని చెబుతుండేవారు.

రామేశ్వరం

రామేశ్వరం

ఏపీజే అబ్దుల్‌ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్‌ 15వ తేదీన తమిళనాడు రామేశ్వరంలో జైనులాబ్దిన్‌, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. కలాం కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్న తనం నుంచే తన అవసరాలకు పేపర్ బాయ్ గా పని చేశారు. 1960 సంవత్సరంలో ది మద్రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ" నుంచి అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ పట్టా పొందారు. డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా పనిచేశారు. 1963, ఆ తర్వాత పలు దేశాల్లో పర్యటించారు.

కీ రోల్

కీ రోల్

బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లో రీ రోల్ పోషించారు. భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా వ్యవహరించారు. అరవై దశకంలో చైనా, పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలాం గుర్తించారు. ఆ సమయంలో పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలాం ఎంతగానో కృషి చేశీరు. 1970 దశకంలో బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే సంకల్పాన్ని అబ్దుల్ కలాం వ్యక్తపరిచారు.

భారతరత్న

భారతరత్న


ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌కు రూపకల్పన చేసి.. ఆ ప్రాజెక్టుల విషయం లో అబ్దుల్ కలాం విశేషంగా సేవలు అందించారు. 1997లో ఆయనను భారతరత్న వరించింది. దేశానికి 2002 నుండి 2007వరకు 11వ రాష్ట్రపతిగా కలాం సేవలు అందించారు..భారత్ రక్షణ రంగం బ్రహ్మోస్‌ వంటి సూపర్‌ సానిక్‌ మిస్సైల్‌ను తయారు చేయగలిగిందంటే దానికి కారణం అబ్దుల్‌ కలాం వేసిన గట్టి పునాదులే.

40 డాక్టరేట్లు

40 డాక్టరేట్లు

40 కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసాయి. ప్రముఖ రచయిత అరుణ్‌ తివారి సాయంతో ఆత్మకథ పుస్తకాన్ని వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్ పేరుతో విడుదల చేసారు. 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్‌‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు.

English summary
Former President APJ Abdul Kalam passed away on this day in 2015. he is an aerospace scientist by profession served as the 11th president of india.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X