వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సహజవాయువు ధరకు రెక్కలు.. మరోసారి 40 శాతం పెంపు, సీఎన్జీ కూడా

|
Google Oneindia TeluguNews

సహజ వాయువు ధరకు రెక్కలొచ్చాయి. 2019 ఏప్రిల్ నుంచి మూడోసారి ధర పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, ఆటోమొబైల్స్ నడపడానికి.. సీఎజ్జీగా మార్చబడే సహజ వాయువు ధర పెరిగింది. శుక్రవారం దీని ధర 40 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర హైక్ అయ్యింది.

గ్యాస్ రేట్ హైక్

గ్యాస్ రేట్ హైక్


దేశంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో మూడింట రెండు వంతుల గ్యాస్ అంటే బ్రిటిష్ థర్మల్ 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు పెంచారు. ఈ మేరకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ మాత్రం కేజీ బేసిన్‌లో డీ6 బ్లాక్ నుంచి గ్యాస్ ధరను 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచేసింది. అడ్మినిస్ట్రేటివ్, రెగ్యులేటెడ్ ఫీల్డ్‌లలో ఈ ధర ఎక్కువ.

 ఎందుకంటే..?

ఎందుకంటే..?


ఎరువు తయారీ, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇదీ పనిచేస్తోంది. వంట అవసరాల కోసం కూడా పైప్ ద్వారా ఇస్తారట. గతేడాది సీఎన్జీ గ్యాస్ పెరగడంతో.. పైప్డ్ గ్యాస్ ధరల పెరుగుల ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్యాస్ ధరలపై సమీక్ష జరుపుతుంది. అమెరికా, కెనడా, రష్యాలో గ్యాస్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల.. మిగతా దేశాల్లో ధర నిర్ణయించడం ఆలస్యం అవుతుంది.

ధరల పెరుగుదలపై ఫోకస్

ధరల పెరుగుదలపై ఫోకస్


గత 8 నెలల నుంచి ధరల నియంత్రణపై ఆర్బీఐ మరింత ఫోకస్ చేసింది. లేదంటే ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది. ధరల నిర్ణయించడానికి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మాజీ ప్లానింగ్ కమిషన్ మెంబర్ కిరిట్ ఎస్ పరీఖ్ సెప్టెంబర్ చివరి నాటికి ధరను సూచించాలని కోరింది. కానీ నివేదిక ఇప్పటికీ రాలేదు.

ఇలా తగ్గింపు.. కానీ

ఇలా తగ్గింపు.. కానీ


స్థానికంగా ఉత్పత్తి అయిన గ్యాస్ కోసం 2014లో ప్రభుత్వం ఒక సూత్రం రూపొందించింది. దీని ప్రకారం రేట్లు తగ్గించబడ్డాయి. మార్చి 2022 వరకు ఉత్పత్తి వ్యయం కన్న తక్కువగా ఉన్నాయి. ఉక్రెయిన్ తర్వాత రష్యా దాడి తర్వాత ధరల పెరుగుల పెరుగుతూ వస్తోంది. దీంతో ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్ డబుల్ ధర పెరిగింది.కేజీ డీ6 నుంచి రిలయన్స్ తీసిన గ్యాస్ ధర కూడా 9.92 డాలర్లకు పెరిగింది. సహజ వాయువు ధర ఇప్పుడు 6.7 శాతం ఉండగా.. దానిని 2030 నాటికి 15 శాతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది.

English summary
Prices of natural gas were on Friday hiked by steep 40% to record levels, in step with global firming up of energy rates. rate paid for gas produced from old fields, which make up for about two-thirds of all gas produced in the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X