చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్యాప్టెన్ మీటింగ్: రోడ్డు మీద మీడియా

|
Google Oneindia TeluguNews

చెన్నై: డీఎండీకే అధిపతి, క్యాప్టెన్ విజయ్ కాంత్ విచిత్ర తీరుతో విలేకరులు రోడ్డు మీద కుర్చుని సమాచారం సేకరించవలసి వచ్చింది. విలేకరులు కుర్చోవడానికి కనీసం కుర్చీలు ఏర్పాటు చెయ్యకుండా డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మరో సారి తన బుద్ది చూపించారు.

చెన్నైలోని పెరంబలూరు వేదికగా శనివారం డీఎండీకే సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కావలసిన సమావేశం 10.45 గంటలకు ప్రారంభం అయ్యింది. విజయ్ కాంత్ తో పాటు పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరైనారు.

వేదిక ప్రవేశ మార్గంలో సెయింట్ జార్జ్ కోట (సచివాలయం)ను తలపించే రీతిలో భారీ సెట్ వేశారు. ఈ సమావేశం అనంతరం తాను ఎవరితో పొత్తు పెట్టుకుంటానో చెబుతానని గతంలో విజయ్ కాంత్ చాల సార్లు చెప్పారు.

No seating arrangements made for journalists in Chennai

తమిళనాడులోని ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజలు విజయ్ కాంత్ ఏమి చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమావేశం వార్తలను సేకరించడానికి విలేకరులు అక్కడికి వెళ్లారు. అయితే కుర్చోవడానికి ఎక్కడా వారికి కుర్చీలు లేవు.

మీడియా పాయింట్ అనేది లేదు. చివరికి విలేకరులు సమావేశం వేదిక బయట పాత కార్పెట్ ఒకటి ఉంటే అక్కడ కుర్చుకుని సమాచారం సేకరించారు. మీడియా పట్ల డీఎండీకే నేతలు ప్రవర్తించిన తీరును పలువురు పాత్రికేయులు విమర్శించారు.

English summary
No seating arrangements made for journalists who went to cover DMDK general council and executive committee meeting which was held in Perambalur on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X