Sumalatha: బీజేపీలో చేరికపై, కొత్త పార్టీ వియంలో క్లారిటీ ఇచ్చిన ఎంపీ సుమలత, రెబల్ స్టార్ !
బెంగళూరు/మండ్య: బీజేపీలో చేరే విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, మండ్య ఎంపీ, తెలుగింటి ఆడపడుచు శ్రీమతి సుమలత అన్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం ప్రజలు ఏం చెబితే అది చెయ్యడానికి, వారు చెప్పినట్లు నడుచుకోవడానికి నేనే సిద్దంగా ఉన్నానని. జరగబోయేది అదే అని మండ్య ఎంపీ సుమలత అన్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిర్ణయమే మా నిర్ణయం అని సుమలత అన్నారు. మీరు కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని ప్రచారం జరుగుతోందని మీ నిర్ణయం ఏమిటని మీడియా ప్రశ్నించగా దానికికూడ కర్ణాటకలోని మండ్య ఎంపీ సుమలత సమాధానం ఇచ్చారు.

ఆరోజు నిర్ణయం తీసుకుంటాను
మండ్య జిల్లా ప్రజలతో చర్చించిన తర్వాత తాను ఏ పార్టీలో చేరాలి అనే నిర్ణయం తీసుకుంటానని సుమలత అన్నారు. శుక్రవారం మండ్యలో సుమలత మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తాను ఏ పార్టీతో సంబంధం లేకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీ సుమలత అంబరీష్ అన్నారు.

అభిమానంతో నా ఫోటో పెట్టుకున్నారు
గత ఎన్నికల్లో తమకు వచ్చిన పాపులారిటీ కోసమే బీజేపీ నేతలు, కార్యకర్తలు నా ఫొటోలు పెట్టారన్నారు. సచ్చిదానందకు నా మద్దతు ఉందన్నదని, అంది ఓపెన్ సీక్రేట్ అని, సచ్చిదానందకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని సుమలత తేల్చి చెప్పారు. సచ్చిదానందకు నా మద్దతు ఉందని బహిరంగంగానే చెప్పాను. నేను ప్రజలను సంప్రదించి వారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సుమలత అన్నాను. మండ్య ప్రజలతో ఇప్పటికే ఒక్కసారి చర్చించానని, ఏ పార్టీలో చేరవద్దని, తటస్థంగా ఉండమని ప్రజలు చెప్పారని సుమలత వివరించారు.

కొత్త పార్టీ విషయంలో సుమలత క్లారిటీ
ఎన్నికల్లో సచ్చిదానంద నా ఫోటో పెట్టాడు కాబట్టి వేరే అర్థాలు చెప్పుకోవదని ప్రజలకు సుమలత మనవి చేశారు. ఎంపీ సుమలత కొత్త పార్టీ పెడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోందని, మీ నిర్ణయం ఏమిటని మీడియా ప్రశ్నించింది. కొత్త పార్టీ పెట్టే విషయంలో సుమలత నవ్వుతూ సమాధానం చెప్పారు. భగవంతుడు నాకు ఇంత బలాన్ని ఇస్తే తప్పకుండా పెడుతానని, అయితే ప్రస్తుతానికి కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని సుమలత క్లారిటీ ఇచ్చారు.

కేంద్ర మంత్రిని కలిసిన సుమలత
గురువారం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ సుమలత బెంగళూరు-మైసూర్ హైవే అశాస్త్రీయ అంశాన్ని లేవనెత్తారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆదేశాలు ఇస్తానని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని సుమలత మీడియాకు చెప్పారు. మండ్యలో ఉండటం, బయట నుంచి పోటీ చెయ్యడం అనే విషయంలో సుమలత మాట్లాడుతూ అది దేవుడే నిర్ణయిస్తాడని అన్నారు.

గొడ మీద దీపం పెట్టిన సుమలత
మండ్య ప్రజలకు మేలు చేస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారని సుమలత అన్నారు. విధానసౌధ కారిడార్‌లో 10 లక్షల రూపాయలతో మండ్య ఇంజనీరు చిక్కిపోయిన విషయంలో మాట్లాడిన సుమలత లంచగొండి అధికారుల మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సుమలత రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేశారు. బీజేపీలో ఇప్పట్లో చేరే అవకాశం లేదని సుమలా చెప్పినా ఎంపీ సుమలతా ప్రధాన అనుచరుడు సచ్చిదానంద ఇప్పటికే బీజేపీలో చేరిపోయిన విషయం తెలిసిందే.
-
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!












Click it and Unblock the Notifications