వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిగత సమాచార బిల్లులో గోప్యతకు రక్షణేదీ- కేంద్రానికి కీలకాధికారాలు- విపక్షాల అసమ్మతి నోట్

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు కాకరేపుతోంది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధల సమాచార గోప్యత విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షే కారణం. ఈ బిల్లు చట్టంగా మారితే కేంద్రం ప్రభుత్వానికి వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో విశేషాధికారులు దఖలు పడనున్నాయి. ఇది అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు కేంద్రానికి అసమ్మతి నోట్ పంపాయి.

 వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు

వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు

దేశంలో పౌరులు, వ్యక్తులు, సంస్ధలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే విషయంలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెగాసస్ వంటి స్పైవేర్ లను వాడటం ద్వారా కేంద్రం ఇలాంటి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, దీనిపై సుప్రీంకోర్టు సైతం నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తున్న తరుణంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కేంద్రానికి సవాళ్లు విసురుతోంది. దీంతో కేంద్రం వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును తెచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఇందులో పొందుపరిచిన అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

 విపక్షాల అభ్యంతరాలు

విపక్షాల అభ్యంతరాలు

కేంద్ర ప్రభుత్వం పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే పేరుతో తీసుకొస్తున్న బిల్లులో అంశాలపై విపక్షాలు ముందే పెదవి విరుస్తున్నాయి. ఈ బిల్లు వల్ల పౌరుల, సంస్ధల వ్యక్తిగత సమాచారం రక్షణ సంగతేమో కానీ కేంద్రానికి మాత్రం వారిపై పెత్తనం చెలాయించే విశేషాధికారులు దఖలు పడటం ఖాయమంటున్నాయి. ఈ బిల్లులో పొందుపరిచిన పలు అంశాలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు యథాతథంగా పార్లమెంటులో ఆమోదం పొందితే కేంద్రం తమకు కావాల్సిన వారి డేటాను మాత్రమే రక్షించే వీలుంటుందని, మిగతా డేటా కేంద్రం చేతుల్లోకి వెళ్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసమ్మతి నోట్ పంపిన విపక్ష ఎంపీలు

అసమ్మతి నోట్ పంపిన విపక్ష ఎంపీలు

నిన్న జరిగిన సమావేశంలో పార్లమెంటు ప్యానెల్ తన నివేదికను ఆమోదించిన తర్వాత, వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పార్లమెంటు జాయింట్ కమిటీకి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బిజెడికి చెందిన ఏడుగురు ఎంపీలు అసమ్మతి నోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఏ ఏజెన్సీని అయినా చట్టం నుంచి మినహాయించేలా అనుమతించే క్లాజుపై దాదాపు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులో, నివేదికలోని ఇతర లోపాలను కూడా వారు ప్రశ్నించారు. దీంతో కేంద్రానికి విశేషాధికారాలు కల్పించే ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు విపక్ష ఎంపీలు చెప్తున్నారు.

కాంగ్రెస్ అభ్యంతరాలివే

కాంగ్రెస్ అభ్యంతరాలివే

కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తన అసమ్మతి నోట్‌లో సెక్షన్ 35పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏ ఏజెన్సీని అయినా మొత్తం చట్టం నుండి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇది ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యక్తిగత సమాచారం ఇచ్చేందుకు సమ్మతించే నిబంధనల నుంచి ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం సరికాదని మరో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తెలిపారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పూర్తిగా వ్యతిరేరిస్తునట్లు ఆయన అసమ్మతి నోట్ లో పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా బిల్లులోని సెక్షన్ 12 , 35 ప్రకారం ప్రభుత్వానికి, దాని సంస్థలకు అందించిన విస్తృత మినహాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధునిక నిఘా నెట్‌వర్క్‌ను ఏర్పాటు, ఇలా పెట్టే నిఘాతో ఉత్పన్నమయ్యే హానిపై కేంద్రం దృష్టిసారించకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ గగోయ్ తప్పుబట్టారు. ఈ బిల్లులో అంశాలపై పార్లమెంటరీ పర్యవేక్షణ లేకపోవడం; ఫ్రేమ్‌వర్క్ కింద వ్యక్తిగతేతర డేటా నియంత్రణ, జరిమానాల లెక్కింపులో వైఫల్యంపై మరో కాంగ్రెస్ ఎంపీ వివేక్ తంఖా అసమ్మతి నోట్ ఇచ్చారు.

తృణమూల్, బీజేడీ అభ్యంతరాలివే

తృణమూల్, బీజేడీ అభ్యంతరాలివే


తమ ఉమ్మడి అసమ్మతి నోట్‌లో, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్ ఓ బ్రియాన్, మహువా మొయిత్రా, డేటా నిబంధనల గోప్యత హక్కును రక్షించడానికి బిల్లులో తగిన రక్షణలు లేవని కేంద్రానికి తేల్చిచెప్పారు. టీఎంసీ ఎంపీలు కమిటీ పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తారు, వాటాదారుల సంప్రదింపులకు తగినంత సమయం, అవకాశం ఇవ్వకుండా కమిటీ తొందరపడిందని చెప్పారు. చట్టం పరిధిలోకి వ్యక్తిగతేతర డేటాను చేర్చడంపై టీఎంసీ ఎంపీలు నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి క్లాజ్ 35లో సరైన రక్షణలను ప్రవేశపెట్టడంలో కమిటీ విఫలమైందని టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓ'బ్రియన్, మహువా మోయిత్రా చెప్పారు. ప్రతిపాదిత డేటా రక్షణ అథారిటీ సభ్యులు, చైర్‌పర్సన్ ఎంపిక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఎక్కువగా ఉందని వారు అభ్యంతరం తెలిపారు. బీజేడీకి చెందిన ఎంపీ అమర్ పట్నాయక్ కూడా డేటా రక్షణ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

English summary
three opposition parties inlcuding congress, bjd and tmc have sent dissent note on personal data protection bill to central govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X