T20 World Cup Winner: వరల్డ్ కప్ విజేత ఎవరంటే ? జడేజా ప్రశ్నకు తేల్చేసిన గ్రోక్..!

టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026)సెమీ ఫైనళ్లు ముగిశాయి. ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. వచ్చే ఆదివారం భారత్-న్యూజీలాండ్ మధ్య ఫైనల్ (T20 World cup final) పోరుకు రంగం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా భారత్, న్యూజీలాండ్ బలాబలాలు, టోర్నీలో రికార్డు, గతంలో వీరి మధ్య జరిగిన మ్యాచ్ ల్లో ఏం జరిగింది, ఐసీసీ టోర్నీల్లో వీరిద్దరిలో ఎవరికి మెరుగైన రికార్డు ఉంది.. ఇలా పలు అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కించి ఫైనల్ గా టైటిల్ విజేత (T20 World Cup Winner) ఎవరో ఏఐ ప్లాట్ ఫామ్ గ్రోక్ చెప్పేసింది.

టీమిండియా మాజీ క్రికెటర్, ఆప్ఘనిస్తాన్ జట్టుకు జాతీయ కోచ్ గా కూడా పనిచేసిన అజయ్ జడేజా (Ajay Jadeja) కూడా భారత్-కివీస్ మధ్య జరిగే పైనల్ పోరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ విజేత ఎవరో తెలుసుకునేందుకు ఏఐ ప్లాట్ ఫామ్ గ్రోక్ (grok)ను ఎక్స్ లో ఇదే ప్రశ్న అడిగాడు. దీంతో గ్రోక్ ఎలాంటి మొహమాటాల్లేకుండా సమాధానం చెప్పేసింది. అంతే కాదు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాల్ని కూడా బయటపెట్టింది. దీంతో వరల్డ్ కప్ విన్నర్ ఎవరో మరోసారి తేలిపోయింది.

Grok s T20 World Cup Winner Answer to Ajay Jadeja s Burning Question

ఆదివారం అహ్మదాబాద్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ను భారత్, న్యూజీలాండ్ జట్లలో ఎవరు గెల్చుకుంటారని అజయ్ జడేజా నేరుగా గ్రోక్ ను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా గ్రోక్.. కచ్చితంగా టీమిండియా గెల్చుకుంటుందని చెప్పేసింది. సూర్యకుమార్ యాదవ్ అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ట్రోఫీని ఎత్తుకోవడం ఖాయమని చెప్పేసింది. సొంత అభిమానుల బలం, జట్టులో బ్యాటింగ్ లోతు, బుమ్రా మ్యాజిక్ భారత్ కు న్యూజీలాండ్ పై ఎడ్జ్ ఇస్తున్నాయని గ్రోక్ తెలిపింది. తాను కూడా ఫైనల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు గ్రోక్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+