వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిల్గిత్-బాల్టిస్థాన్‌కు ప్రావిన్షియల్ హోదా కల్పించాం: ఇమ్రాన్ ఖాన్, భారత్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. గిల్గిత్-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్-బాల్టిస్థాన్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా, దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

Recommended Video

Pak Move On Gilgit-Baltistan భారత భూభాగాలను అక్రమంగా ఆక్రమిస్తున్న పాక్... India ఘాటు హెచ్చరిక...

ఇది భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం జమ్మూకాశ్మీర్, లడఖ్ తోపాటు గల్గిత్-బాల్టిస్థాన్‌గా పిలిచే ప్రాంతం మొత్తం భారత్‌లో అంతర్భాగమేనని మనదేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తేల్చి చెప్పారు. చట్ట విరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎలాంటి అధికారం పాకిస్థాన్‌కు లేదని స్పష్టం చేశారు.

 Pakistan Move On Gilgit-Baltistan Attempt To Hide Illegal Occupation: India

ఏడు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మానవహక్కుల ఉల్లంఘన, దోపిడీ, స్వేచ్ఛను హరిస్తున్నా పాకిస్థాన్.. ఇలాంటి దురాక్రమణ వల్ల ఆ నిజాలను దాచలేదన్నారు. భారత భూభాగాలపై ఇలాంటి దురాక్రమణలు, ఆపేసి, వారి ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌ను హెచ్చరించింది.

కాగా, గిల్గిత్-బాల్టిస్థాన్‌ను తమ దేశంలో విలీనం చేసుకోవాలని పాకిస్థాన్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గిల్గిత్-బాల్టిస్థాన్ స్థాయిన మార్చాలని పాక్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో గిల్గిత్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ప్రావిన్షియల్ హోదాపై అధికారిక ప్రకటన చేయడం గమనార్హం. భారత్ కంటే.. తామే ఈ ప్రాంతానికి న్యాయం చేశామంటూ ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా ప్రగల్బాలు పలికాడు.

అయితే, నిజానికి గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతానికి అప్పటికే స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని అలాగే ఉంచేందుకు తన వాదనలకు చట్టబద్దత కల్పించేందుకు పాక్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. కాగా, ఈ ప్రాంతంలోని మెజార్టీ ప్రజలు పాక్ పాలనను వ్యతిరేకిస్తుండటం గమనార్హం.

English summary
Pakistan Move On Gilgit-Baltistan Attempt To Hide Illegal Occupation: India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X