షాక్: పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఇక అంతే

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:ఆధార్ కార్డుతో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే వచ్చే ఏడాది నుండి పాన్ కార్డులు పనికిరాకుండా పోతాయని కేంద్రప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఆధార్ ను ప్రతిదానికి అనుసంధానం చేస్తోంది ప్రభుత్వం. ప్రధానంగా ఎల్ పి జి సబ్సిడీ కోసం ఆధార్ ను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు.అయితే రానున్న రోజుల్లో ప్రతి దానికి ఆధార్ తో అనుసంధానం చేయాలని సర్కార్ భావిస్తోంది.

ఆధార్ అనేది తప్పనిసరికాదు, స్వచ్చంధమే అని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటీకి కూడ కేంద్రం ఆధార్ ను తప్పనిసరి చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

నల్లధనానికి చెక్ పెట్టే ఉద్దేశ్యంతోనే ఆధార్ తోనే అన్నింటిని లింక్ చేయాలని సర్కార్ భావిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీ

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకేజీ

ఈ ఏడాది డిసెంబర్ నాటికి పాన్ కార్డులను ఆధార్ కార్డులను లింకేజీ చేయాలని కేంద్రప్రభుత్వం తలపెట్టింది.ఈ ఏడాది చివరినాటికి పాన్ కార్డులను ఆధార్ తో లింక్ చేయకపోతే వచ్చే ఏడాది నుండి పాన్ కార్డులు పనిచేయని పరిస్థితి నెలకొంటుంది.నకిలీ పాన్ కార్డులకు చెక్ పెట్టేందుకుగాను ఆధార్ కార్డులను లింకు చేయాలని కేంద్రం భావిస్తోంది.

అక్రమాలకు చెక్ పెడతారిలా

అక్రమాలకు చెక్ పెడతారిలా

ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింకేజీ చేయడం వల్ల అక్రమాలకు చెక్ పెట్టవచ్చని సర్కార్ భావిస్తోంది. దేశ జనాభాలో సుమారు 108 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. సుమారు 25 కోట్ల మందికి పాన్ కార్డులున్నాయి.ఈ రెండింటిని లింకు చేయడం ద్వారా నకిలీలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.అయితే నల్లధనాన్ని మార్పిడి చేసుకొనేందుకుగాను అక్రమార్కులు తప్పుడు పాన్ కార్డులను సృష్టించారని అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆధార్ తో పాన్ కార్డుకు లింక్ చేయడం వల్ల అక్రమాలను చెక్ పెట్టే అవకాశం ఉంది.

రూ.50 వేలు దాటితే పాన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సిందే

రూ.50 వేలు దాటితే పాన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సిందే

రూ.50 వేలకు మించిన నగదు లావాదేవీలను అన్నింటికీ పాన్ కార్డు నెంబర్ ను రాయడం తప్పనిసరి.అంతేకాదు రెండు లక్షలకు మించి బంగారం కొనుగోలు చేసినా పాన్ నెంబర్ ను రాయాల్సిందే. ఈ నేపథ్యంలో పాన్ కార్డుల సంఖ్య కూడ పెరిగే అవకాశాలున్నాయి.దరిమిలా నకిలీలకు చెక్ పెట్టేందుకుగాను ఈ మేరకు సర్కార్ ప్లాన్ చేసింది.

ఆధార్ ఉందని నిరూపించుకోవాలి

ఆధార్ ఉందని నిరూపించుకోవాలి

ఆధార్ ను లింక్ ను పాన్ కార్డుకు లింక్ చేసుకోకపోతే తమకు ఆధార్ కార్డు ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేసుకోకపోతే తమకు ఆధార్ కార్డు ఉందని నిరూపించుకోవాల్సిందే.కేంద్రం తెస్తున్న నిబంధనలు అక్రమార్కులకు చెక్ పెట్టనున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Permanent account numbers (PAN) not linked to Aadhaar cards will likely become invalid after December 31, a government source said on Thursday, as the Centre pushes to widen the use of the 12-digit biometric identity project.
Please Wait while comments are loading...