వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుకు షాక్ ,నిబద్దత గురించి లేఖ రాసిన పైలెట్

కేంద్ర పౌరవిమానాయశాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజుకు ఎయిరిండియా పైలెట్ షాకిచ్చాడు. ప్రైవేట్ విమానసంస్థలతో పోలిస్తే ఎయిరిండియా ఉద్యోగుల్లో అంకిత బావం కొరవడిందన్నారు. ఈ వ్యాఖ్యలపై మజుందార్ అనే పైలెట్ ఘాటుగానే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఎయిర్ ఇండియా పైలెట్ ఒకరు కేంద్ర విమానాయశాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజుకు షాక్ ఇచ్చారు. రాజకీయ నాయకుల నిబద్దతను, ప్రేరణను ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్రమంత్రికి ఆ పైలెట్ లేఖ రాశాడు. అయితే ఈ వ్యాఖ్యాలు ఎయిరిండియాకు సంబందం లేదని, పైలెట్ వ్యక్తిగతమైన వ్యాఖ్యలుగా ఎయిరిండియా ప్రకటించింది.

ఎయిరిండియా పనితీరుపై కేంద్ర విమానాయశాఖ మంత్రి ఆశోక్ గజపతి రాజు మండిపడ్డారు.ప్రైవేట్ విమాన సంస్థలు, ప్రభుత్వ రంగంలోని ఎయిరిండియా సంస్థకు మద్య వ్యత్యాసాన్ని మంత్రి ప్రశ్నించారు. ఎయిరిండియా ఉద్యోగుల్లో అంకితభావం నిబద్దత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కేంద్రమంత్రి ఎయిరిండియా ఉద్యోగుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అయితే ఈ వ్యాఖ్యాలపై ఎయిరిండియా పైలెట్ ఒకరు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల నిబద్దతను ఆ పైలెట్ ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఆశోక్ గజపతి రాజుకు ఎయిరిండియా పైలెట్ సుభాషిష్ మజుందార్ లేఖ రాశాడు.

 pilot wrote a letter to central minister about commitment

రాజకీయ నాయకుల్లో లోపిస్తున్న ప్రేరణ, నిబద్దతలను ఆయన ప్రశ్నించాడు. ఓ బాద్యత గల ఉద్యోగిగా నిజాయితీగా పన్ను చెల్లించే వ్యక్తిగా దేశ పౌరుడిగా ఈ ఏడాది శీతాకాల లోక్ సభ, రాజ్యసభ విలువైన సమయాన్ని వృధా చేయడం పై ఆయన మండిపడ్డారు. కేవలం ఒక్క లోక్ సభలోనే 92 గంటలపాటు సమయం వృధా చేయడం సరైంది కాదన్నారు.

రాజకీయ నాయకులను చూడడం వల్లే ఎయిరిండియా ఉద్యోగుల్లో నిబద్దత కొరవడిందన్నారు. తాము ఏం చేస్తున్నామో ఆత్మవిమర్శ చేసుకోవాలని మజుందార్ కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కోరాడు. అప్పుడైనా ఎయిరిండియా ఉద్యోగులు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగులను ఉద్దేశించి రాజకీయ నాయకులు మాట్లాడడం సరైంది కాదన్నారు పైలెట్.అయితే ఈ లేఖతో కాని, పైలెట్ మజుందార్ వ్యాఖ్యలతో కాని తమకు ఎలాంటి సంబంధం లేదని ఎయిరిండియా ప్రకటించింది. ఈ వ్యాక్యలు మజుందార్ వ్యక్తిగతమైనవిగా ఆ సంస్థ ప్రకటించింది.

English summary
pilot wrote a letter to central minister about commitment,senior pilot majundar has hit out at the political class and questioned their commitment to the nation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X