సభకు మంత్రులను పరిచయం చేసిన మోడీ: టీజీ వెంకటేష్, వెంకయ్య ప్రమాణం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ నూతనంగా మంత్రివర్గంలో చేరిన మంత్రుల వివరాలను సభకు పరిచయం చేశారు. మోడీ కొత్త మంత్రుల పేర్లు పలకగానే.. వారు లేచి సభకు నమస్కారం చేశారు.

PM Narendra Modi appeals for a fruitful monsoon session

ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ తోపాటు సభ్యులు ఇటీవల మరణించిన మాజీ పార్లమెంటుసభ్యులకు లోకసభలో నివాళులర్పించారు. అనంతరం లోకసభ మంగళవారానికి వాయిదా పడింది.

అంతకుముందు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత పలువురు కొత్త రాజ్యసభసభ్యులు ప్రమాణం చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కన్నడ భాషలో ప్రమాణం చేయగా, మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హిందీలో ప్రమాణం చేశారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం నేతలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరిలు ప్రమాణస్వీకారం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minutes before the monsoon sesion is all set to start in Parliament, Prime Minister Narendra Modi on Monday, July 18, appealed opposition for a "fruitful session" ahead.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి