వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం సిద్దూకు సిగ్గు లేదు, కాంగ్రెస్ కు బుద్దిలేదు: ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Modi At Bengaluru : Congress Talks Of ‘Ease Of Doing Crimes'

బెంగళూరు: కర్ణాటక రాజదాని బెంగళూరుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయిన సమయంలోనే మనం ప్రశాంతంగా జీవిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

కన్నడలో మాట్లాడిన మోడీ

కన్నడలో మాట్లాడిన మోడీ

ప్రియ బంధువులారా మీకు నమస్కారం, బెంగళూరు నిర్మాత కెంపేగౌడ, కిత్తూరు రాణిచెన్నమ్మ, సర్ ఎం. విశ్వేశ్వరయ్య లాంటి మహానుభావులు పుట్టిన ఈ భూమి మీద మాట్లాడటం నాకు చాల సంతోషంగా, గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చమైన కన్నడలో మాట్లాడి కన్నడిగులను ఆకట్టుకున్నారు.

కాంగ్రెస్ కౌంట్ డౌన్

కాంగ్రెస్ కౌంట్ డౌన్


కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యిందని, బీజేపీ కార్యకర్తలకు మంచి రోజులు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సిద్దరామయ్య లాంటి అవినీతి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు.

కోటి మంది నిరుద్యోగులకు

కోటి మంది నిరుద్యోగులకు

కర్ణాటకలో కోటి మంది నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసిందని, 7 లక్ష్లల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని, లక్షలాధి మంది ఇళ్లలో ఉచితంగా మలమూత్ర విసర్జన (టాయిలెట్ లు) నిర్మించి ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

బెంగళూరుకు బంపర్ ఆఫర్

బెంగళూరుకు బంపర్ ఆఫర్

బెంగళూరులో ఇంత వరకూ ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్ట్ కు రూ. 17 వేల కోట్లు కేటాయించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో 160 కిలోమీటర్ల దూరం సబ్ అర్బన్ రైలు సంచరించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రధాని మోడీ అన్నారు.

సిద్దరామయ్యకు నిద్ర

సిద్దరామయ్యకు నిద్ర


కర్ణాటక రాష్ట్రం ఏమైనా సరై నాకు నిద్ర మాత్రమే ముఖ్యం అని సీఎం సిద్దరామయ్య ప్రవర్థిస్తున్నారని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆరోపించారు. దేశం కోసం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని బహిరంగంగా దూషిస్తున్న సిద్దరామయ్య ఓ అజ్ఞాని అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆరోపించారు.

3,500 రైతులు ఆత్మహత్య

3,500 రైతులు ఆత్మహత్య


కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. 24 మంది హిందూ కార్యకర్తలను దారుణంగా హత్య చేసినా సిద్దరామయ్య ప్రభుత్వం దేశద్రోహులతో చేతులు కలిపిందని ఆరోపించారు.

 ఎస్ఎం క్రిష్ణ మాత్రమే

ఎస్ఎం క్రిష్ణ మాత్రమే

బెంగళూరు ప్యాలెస్ మైదానంలోని వేదిక మీద ఉన్న నాయకులను పెద్దగా పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోడీ కార్ణాటక మాజీ సీఎం, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి ఎస్ఎం. క్రిష్ణతో మాత్రమే కొంత సన్నిహితంగా మాట్టాడారు.

ప్రముఖులు

ప్రముఖులు

ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రులు ఎస్ఎం. క్రిష్ణ, బీఎస్. యడ్యూరప్ప, జగదీష్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప, కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్ కుమార్, ప్రకాష్ జయదేవకర్, అనంత్ కుమార్ హెగ్డే, బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురేందేశ్వరి, బీజేపీ ఎంపీలు బళ్లారి శ్రీరాములు, శోభా కరంద్లాజే, పీసీ. మోహన్, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్. అశోక్, మాజీ మంత్రి అరవింద్ లింబావలి తదితరులు పాల్టొన్నారు.

English summary
Prime Minister's rally marks the conclusion of the BJP's 90 day Nava Nirman Parivarthan Yatra across Karnataka. Assembly elections in the state are due in late April early May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X