ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల రాంగ్ ఓటు?: షేమ్ అన్న చంద్రబాబు, అదే ముంచిందని..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నిక‌ల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభ‌మైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలు ఢిల్లీకి వెళ్తాయి.

-రాంగ్ ఓటు వేయడం షేమ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మాక్ పోలింగ్ కొంపముంచిందని ఎమ్మెల్యేలు వాపోయారు.
- ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు రాంగ్ ఓట్ వేశారు. కదిరి బాబురావు, జితేందర్ గౌడ్‌లు బ్యాలెట్ పేపర్లపై పేర్లు రాశారు.
- రాయపాటి సాంబశివ రావు, ఆదినారాయణ రెడ్డి, తోట త్రిమూర్తులు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు అందరికంటే ఆలస్యంగా ఓటువేశారు.

- 174 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ అమరావతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- రాష్ట్రపతి ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఓటు వేయడానికి రాని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలకు వెంటనే ఫోన్ చేయాలని, క్రమశిక్షణ తప్పితే ఎలా అని మండిపడ్డారు. ఒక్క ఎమ్మెల్యే మిస్ కావొద్దన్నారు.

- ఢిల్లీలో ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- తెలంగాణలో సీఎం కేసీఆర్ తొలి ఓటు వేశారు.

- అమరావతిలో చంద్రబాబు తొలి ఓటు వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ రెండో ఓటు వేశారు.

- ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీలో ఉన్నారు.

- ఈ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్‌ పత్రాలపై ఓట్లు వేస్తారు. శాసనసభ్యుల కోసం గులాబీ రంగులో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించారు.

- ఎంపీల ఓట్లకు స్థిర విలువ ఉంది. శాసనసభ్యుల ఓట్లకు మాత్రం వారి వారి రాష్ట్రాలను బట్టి విలువ మారుతుంది. కాబట్టి వేర్వేరు రంగుల బ్యాలెట్లను సిద్ధం చేశారు.

మోడీ ముందు తేల్చేయనున్న వెంకయ్య: ఎన్టీఆర్‌కు అండగా... ఇదీ వెంకయ్య!

Presidential elections Live: Voting begins

- రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4,896 మంది ప్రజా ప్రతినిధులకు ఉంది. నామినేటెడ్‌ సభ్యులు మినహా మిగిలిన చట్టసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

- ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 పాయింట్లుగా ఉంటుంది. మొత్తం ఓట్లు 10,98,903. ఎంపీల ఓట్లు 5,49,408, ఎమ్మెల్యేల ఓట్ల విలువ 5,49,495. 543 మంది లోకసభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 4,120 మంది శాసన సభ్యులు ఉన్నారు.

Ramnath Kovind vs Meira Kumar : Dalit vs Dalit battle | Oneindia News

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ram Nath Kovind is set to become the next President of India. With 70 per cent of the votes in the electoral college with him, it appears that Kovind is set to trounce his opponent, Meira Kumar.
Please Wait while comments are loading...