"రజనీకాంత్‌తో వారికి సంబంధం లేదు, గుర్తించలేదు"

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ప్రవేశిస్తానని ప్రకటించడం సంచలనమే సృష్టించింది. ఈ నేపథ్యంలో పలు టీవీ చానెల్లు చర్చలు నిర్వహిస్తున్నాయి. రజనీకాంత్ తరఫున కొంత మంది టీవీ చానెళ్లు నిర్వహిస్తున్న చర్చల్లో పాలు పంచుకుంటున్నారు.

ఆ చర్చలపై రజనీకాంత్ అభిమానుల సంఘం కీలకమైన ప్రకటన చేసింది. రజనీకాంత్ పార్టీ తరపున ఎవరిని కూడా అధికార ప్రతినిధిగా గుర్తించలేదని సంఘం స్పష్టం చేసింది. రజనీ తన పార్టీ పేరును స్వయంగా ప్రకటించిన తర్వాత మాత్రమే అన్ని విషయాలు తెలియజేస్తామని ప్రకటిస్తామని సంఘం అధ్యక్షుడు విఎం సుధాకర్ తెలిపారు.

Rajini

ఇప్పటి వరకూ టీవీ చర్చల్లో, మీడియా సమావేశాల్లో రజనీకాంత్ పార్టీ గురించి మాట్లాడే విషయాలు వారి సొంత అభిప్రాయాలు మాత్రమేనని అన్నారు, వారి వక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా పరిగణించకూడదని స్పష్టం చేశారు.

పార్టీ తరపుననే కాకుండా అభిమాన సంఘాల తరపున కూడా ఎవరినీ అధికార ప్రతినిధిగా గుర్తించలేదని ఆయన అన్నారు. రజనీకాంత్‌తో టీవీ చానెళ్లలో, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నవారికి సంబంధం లేదని అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tamil super star Rajinikanth Fans association president VM Sudhakar said that no body was appointed as spokes person for the party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి