సీఈసీని వ్యతిరేకిస్తూ రాంలీలాకు దూరంగా ఆ పార్టీలు..! మోడీకి భయపడ్డాయా ?
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు, ఎస్ఐఆర్ అక్రమాల, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం.. ఇలా పలు విషయాల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై పోరాటం చేస్తున్న విపక్ష ఇండియా కూటమి (Opposition) ఇవాళ ఢిల్లీ రాంలీలా మైదానంలో భారీ నిరసన నిర్వహిస్తున్నాయి. దీనికి ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలతో పాటు ఈసీ మీద పోరాడుతున్న పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈసీపై పోరాటం చేస్తూ కూడా రాంలీలా మైదానానికి రాకుండా దూరంగా పలు పార్టీలు ఉండిపోయాయి.
ఈసీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఇండియా కూటమి రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న భారీ సభకు కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, శివసేన ఉద్ధవ్ వర్గం, శరద్ పవార్ ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా ఇండియా కూటమిలో ఉన్న పలు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. కానీ అదే ఇండియా కూటమిలో ఉన్న ఆప్, డీఎంకే సహా పలు పార్టీలు మాత్రం హాజరు కాలేదు. ఈ పార్టీలు గత కొంతకాలంగా ఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొంటున్నా విపక్షాల ఐక్యత చాటుకోవాల్సిన కీలక సమయంలో మాత్రం రాంలీలా మైదానానికి రాకుండా దూరంగా ఉండిపోయాయి.

ఇవాళ రాంలీలా మైదానంలో జరుగుతున్న నిరసన సభకు అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో పాటు ఇండియా కూటమిలో లేకపోయినా ఈ మధ్య ఈసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు రాకుండా దూరంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ గతంలో ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచాయి. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన పలు బిల్లులకు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతిచ్చాయి. కానీ మారిన పరిస్ధితుల్లో తమ సొంత రాష్ట్రాల్లో అధికారం కోల్పోయాక ఈసీపై పోరు ప్రారంభించాయి. కానీ విపక్షాలతో కలిసే పరిస్ధితి లేకపోవడంతో దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తో కలిసి పోరాడటం ఇష్టం లేక వైసీపీ, బీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలు రాం లీలా మైదానంలో నిరసనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
