బీఎస్పీలోకి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్: మాయావతి ప్రకటన
మాజీ ఐపీఎస్ అధికారి, స్వేరో చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ వచ్చింది. ఆరేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. టీఆర్ఎస్‌లోకి వెళతారనే ప్రచారం జరిగింది. కానీ అదేం జరగలేదు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బహుజనుల కోసం పోరాడుతానని స్పష్టంచేశారు. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్లే అంశం సస్పెన్స్‌గా మారింది. ఇటు స్వయంగా పార్టీ పెడతా అని కూడా కామెంట్ చేశారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.

బీఎస్పీలోకి ప్రవీణ్..
ఇంతలోనే క్లారిటీ వచ్చింది. జాతీయ పార్టీ బీఎస్పీ వైపు వెళుతున్నారని ఆయన శిబిరంలో చర్చ జరిగింది. ఆ వార్తలు నిజమని తేలిపోయింది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరతారని మాయావతి ప్రకటించారు. ఇవాళ ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. కాన్షీరాం అడుగు జాడల్లో నడిచేందుకు తెలంగాణకు చెందిన మాజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బీఎస్పీలో చేరేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. త్వరలో బీఎస్పీ పార్టీలో చేరతారని ఆమె ప్రకటించారు.

అంబేద్కర్ బాటలో..
అంతకుముందు తాను హుజూరాబాద్‌లో కొందరికి మద్దతు ఇస్తున్నానని దుష్ప్రచారం జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తనపై వస్తోన్న ప్రచారాన్ని విశ్వసించొద్దని కోరారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. తనపై కేసులు పెట్టారని ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే తాను పనిచేస్తానని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని వివరించారు.

జోలికొస్తే అంతే
తనను వివాదాల జోలికి లాగకూడదని కోరారు. ఒకవేళ తనను ఎవరైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులు అవుతాయని హెచ్చరించారు. తను ఎవరినీ ఏమీ అననని.. అలాగే తన జోలికి ఎవరూ వచ్చిన చూస్తూ ఊరుకోబోనని స్పష్టంచేశారు. స్వేరో ఏర్పాటు చేసి దళిత జాతి కోసం ప్రవీణ్ కుమార్ పాటుపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన చాలా మంది ఫాలొవర్లు ఉన్నారు. ఈ క్రమంలో మాయావతి ప్రకటన చేశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications