Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత గొప్ప మిత్రుడు: రష్యా రాయబారి కదాకిన్‌ కన్నుమూత

రష్యా రాయబారి, భారత్‌కు గొప్ప మిత్రుడుగా పేరొందిన అలెగ్జాండర్‌ కదాకిన్‌(67) గురువారం తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని కేంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు.

న్యూడిల్లీ: రష్యా రాయబారి, భారత్‌కు గొప్ప మిత్రుడుగా పేరొందిన అలెగ్జాండర్‌ కదాకిన్‌(67) గురువారం తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని కేంద్ర ఆసుపత్రిలో కన్నుమూశారు. 2009 నుంచి రాయబారిగా పనిచేస్తున్న ఆయన భారత్‌-రష్యాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి కీలక పాత్ర పోషించారు.

Russian envoy to India Alexander Kadakin passes away

ఆయన గతంలో(1999-2004) కూడా రాయబారిగా పనిచేశారు. కదాకిన్‌ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన దేశానికి గొప్ప మిత్రుడని, భారత్‌-రష్యాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన నిర్విరామంగా కృషిచేశారన్నారు.

భారత్ ఓ గొప్ప మిత్రుడిని కోల్పోయిందనిరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. కాగా, గతంలో ఓసారి కదాకిన్ మాట్లాడుతూ.. రష్యా తర్వాత తనకు రెండో మాతృదేశం భారత్ అని చెప్పారు. ఇది కర్మభూమి, జ్ఞానభూమి అని చెప్పిన ఆయన.. ఈ దేశం నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+