జైలుకు సంజయ్ దత్: ఏడునెలలు బయటే, భార్య కంటతడి(పిక్చర్స్)
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ శనివారం తిరిగి పుణెలోని యెరవాడ కేంద్ర కారాగారానికి వెళ్లాడు. పెరోల్ పైన బయటకు వచ్చిన ఆయన.. తన పెరోల్‌ను పొడిగించాలని చేసుకున్న విజ్ఞప్తిని జైలు అధికారులు తిరస్కరించడంతో మున్నాభాయ్ మళ్లీ సెంట్రల్ జైలుకు చేరుకోవాల్సి వచ్చింది. డిసెంబర్ 24న జైలు నుంచి అతను బయటకు రాగా, ఆరోగ్యం బాగాలేని కారణంగా పెరోల్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
దీంతో సంజయ్ దత్ చెప్పిన కారణంపై విచారణ చేసి నిజానిజాలను తెలపాలని ముంబైలోని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సూచించామని, అయితే పోలీసుల నుంచి అలాంటిదేమీ లేదంటూ నివేదిక వచ్చిందని, అందుకే పెరోల్ గడువును పొడిగించలేదని జైలు అధికారులు తెలిపారు. సంజయ్ దత్ చికిత్స కోసం పెరోల్‌ను పొడిగించాల్సిన అవసరం లేదని పోలీస్ నివేదిక పేర్కొందని, అందుకే అభ్యర్థనను తిరస్కరించామని జైళ్ల శాఖ తెలిపింది.
మరోవైపు పెరోల్ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలపై సంజయ్ దత్ స్పందించాడు. సెలబ్రిటీని కావడం వల్లే పెరోల్ వచ్చిందనడంలో వాస్తవం లేదన్నారు. ఆయన ప్రతి ఖైదీకి ఏడాదిలో ఒక నెల పెరోల్‌పై బయటకు రావడానికి అవకాశం ఉందన్నారు. జైలు నిబంధనలకు లోబడే తానుంటున్నట్లు చెప్పారు. జైలు అధికారులు కూడా తన విషయంలో చట్టానికి లోబడే వ్యవహరిస్తున్నారన్నారు. మీడియాను తాను గౌరవిస్తానని, మీడియా కూడా తనను గౌరవించాలని అన్నాడు.

సంజయ్ దత్
శనివారం నాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యెరవాడ జైలుకు వెళ్తుండగా కంటతడి పెడుతున్న ఆయన భార్య మాన్యతా దత్.

సంజయ్ దత్
శనివారం నాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యెరవాడ జైలుకు వెళ్తుండగా భార్య మాన్యతా దత్, సోదరి ప్రియా దత్‌లు ఇంటివద్ద....

సంజయ్ దత్
శనివారం నాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యెరవాడ జైలుకు వెళ్తుండగా భార్య మాన్యతా దత్ అతనిని దగ్గరకు తీసుకుంటున్న దృశ్యం.

సంజయ్ దత్
శనివారం నాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యెరవాడ జైలుకు వెళ్తుండగా సోదరి ప్రియాదత్ అతని వద్దకు ఆవేదనగా...
కాగా, సంజయ్ దత్ పెరోల్ పైన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సంజయ్ దత్‌కు ఖరారైన జైలుశిక్ష ఎంత? ఎంతకాలం జైల్లో గడిపారన్న విషయాలను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి.
టాడా చట్టం కింద ముంబై పోలీసులు తొలిసారి 1993 ఏప్రిల్‌లో దత్‌ను అరెస్ట్ చేయగా సుప్రీంకోర్టు 2013 మార్చి 21న ఆయనకు 5 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. నాటి నుంచి 22 నెలల కాలంలో ఆయన కేవలం పదిహేను నెలలు మాత్రమే జైలులో గడిపారు.
1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషిగా తేలడంతో శిక్షను అనుభవిస్తున్న సంజయ్ దత్‌ను జైలు అధికారులు ప్రత్యేకంగా చూస్తున్నారని, సహచర ఖైదీలకు లేని అవకాశాలను కల్పిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications